Thursday, July 24, 2025
HomeMovie Newsమహావతార్ నరసింహ లార్జర్ దెన్ లైఫ్ విజువల్ వండర్

మహావతార్ నరసింహ లార్జర్ దెన్ లైఫ్ విజువల్ వండర్

హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ మహావతార్ నరసింహ విజువల్ వండర్, శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. మహావతార్ నర్సింహకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథను జీవం పోస్తుంది. అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్  కంటెంట్‌లో ఇంతకు ముందు ఎన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. ఇప్పటికే విడుదలైన మహావతార్ నరసింహ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అశ్విన్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.  

- Advertisement -

మహావతార్ నరసింహ ఐడియా గురించి చెప్పండి?
-మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో వస్తున్న ఫస్ట్ మూవీ మహావతార్ నరసింహ. శ్రీమహావిష్ణువు దశావతారాలన్నీ లార్జర్ దెన్ లైఫ్, బిగ్ కాన్వాస్ లో ప్రజెంట్ చేయాలని ఆలోచనతో మహావతార్ యూనివర్స్ మొదలైంది.

– యానిమేషన్ లోనే ఈ సినిమాని నిర్మించాలని ఆలోచన మొదటి నుంచి ఉంది. శ్రీమహావిష్ణువు కథని చెప్పాలంటే యానిమేషన్ అనేది ఒక బెస్ట్ మీడియం. కొన్ని సార్లు నటులు దేవుని పాత్రలు చేసేటప్పుడు చాలా చాలెంజింగ్ గా ఉంటుంది. అప్పటివరకు చేసిన సినిమాల ఇమేజ్ ఈ క్యారెక్టర్ మీద పడుతుంది. అందుకే ఎపిక్ కథల్ని చెప్పడానికి యానిమేషన్ బెస్ట్ మీడియం అని భావించాం.

నరసింహ అవతారాన్నే ముందుగా తీసుకు రావడానికి కారణం?
-ప్రతి అవతారానికి ఒక విశిష్టత ఉంది. నరసింహ అవతారం నేటి సమాజానికి ముఖ్యంగా యువతకి చాలా అవసరం. నరసింహ స్వామి రక్షకుడు.  ప్రజెంట్ సిచువేషన్ కి నరసింహ స్వామి అవతారం ప్రేక్షకుల్లో ఒక కొత్త ఉత్తేజ ఉత్తేజాన్ని నింపుతుందని భావిస్తున్నాము.

ఇలాంటి మైథాలజీ కథ చెప్పాలనే స్ఫూర్తి గురించి?  
ఇది మైథాలజీ కాదు.. ఇది మన చరిత్ర. ప్రతి జనరేషన్ కి మన చరిత్రని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పిల్లలకి, ఈ జనరేషన్ యువతకి మన చరిత్ర తెలియజేయాలి.  

-ఈ సినిమా చేస్తున్నప్పుడు మేము అహోబిలం వెళ్ళాము. స్వామివారి ఆశీర్వాదము ఈ సినిమాపై ఉంది. ఈ కథని మేము శాస్త్రాల నుంచే తీసుకున్నాము.  

హోంబాలే ఫిల్మ్స్ గురించి?
-హోంబాలే ఫిల్మ్స్ తో కలిసి ఈ ప్రాజెక్టు చేయడం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఇలాంటి లార్జెర్దన్ లైఫ్ సినిమాలకు వారి భాగస్వామ్యం మాకు ఎంతగానో ఉపయోగపడింది. వారు ప్రతి విషయంలో మాకు సపోర్ట్ చేశారు. వారికి సినిమా చాలా నచ్చింది. మమ్మల్ని ఎంతో అద్భుతంగా గైడ్ చేశారు.  

మ్యూజిక్ గురించి?
-శ్యామ్ సియస్ అద్భుతమైన మ్యూజిక్ ని కంపోజ్ చేశారు. ఇంటర్నేషనల్ స్థాయిల్లో ఆర్కెస్ట్రా కంపోజ్ చేశారు. చాలా అద్భుతమైన మ్యూజిషియన్స్ ఈ సినిమాకి పనిచేశారు. పవర్ఫుల్ డివైన్ ఫుల్ మ్యూజిక్ ని క్రియేట్ చేశారు. సినిమా చూస్తున్నప్పుడు మ్యూజిక్ ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

ఈ సినిమాల్లో విజువల్స్ ఎలా ఉండబోతున్నాయి?
-ఇప్పటివరకు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయని విజువల్స్ బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నారు. వార్ సీక్వెన్స్ లన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. సరి కొత్త అనుభూతిని పంచుతాయి. చాలా హై స్కేల్ లో తీసిన సినిమా ఇది. విజువల్ వండర్.  

-ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంది. పైసా వసూల్ మూవీ. అలాగే ఒక చరిత్ర, సాంస్కృతి, ధర్మాన్ని కూడా అద్భుతంగా చూపించే సినిమా ఇది

గీత ఆర్ట్స్  తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తుంది ?
-గీతా ఆర్ట్స్ కి వండర్ఫుల్  లెగసి ఉంది. వారు మా సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మా అందరి మీద ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాము.

ఒకవేళ ఈ ప్రాజెక్టుని ఎవరైనా ఒక హీరోతో చేసి ఉంటే ఎవరిని ఎన్నుకునేవారు ?
– హిరణ్య కశ్యప పాత్ర కోసం రానా గారు లేదా విజయ్ సేతుపతి గారు. నరసింహ పాత్ర మాత్రం యానిమేట్ చేయాల్సిందే.

నెక్స్ట్ ప్రాజెక్ట్?
-మహావతార్ పరశురాం ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. అది కూడా చాలా పెద్ద స్కేల్ లో ఉంటుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read