Movie News

‘బైకర్’ రగ్డ్ & స్పోర్టీ ఫస్ట్ లుక్ రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా తన 36వ చిత్రం #శర్వా36లో మోటార్ సైకిల్ రేసర్ పాత్రను పోషిస్తున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో  UV క్రియేషన్స్ ప్రతిష్టాత్మక బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. దీపావళి సందర్భంగా నిర్మాతలు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

ఈ సినిమాకి ‘బైకర్’ అనే పర్ఫెక్ట్ టైటిల్‌ను లాక్ చేశారు, ఇది సినిమా నేపథ్యాన్ని సూచిస్తుంది. శర్వా ఇంటెన్స్ బైకర్ డ్రెస్ లో స్పోర్ట్స్ బైక్‌పై కనిపించడం అదిరిపోయింది. తన లుక్ సినిమా యాక్షన్-ప్యాక్డ్ పల్స్‌ ప్రజెంట్ చేస్తోంది.  బోల్డ్ రెడ్ టైటిల్ లోగో ఆకట్టుకుంది.

1990, 2000ల బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం, రేసింగ్ డ్రీమ్స్, ఎమోషన్స్ ,  ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతుంది.

శర్వా సరసన మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తుండగా, బ్రహ్మాజీ,  అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

జె యువరాజ్ సినిమాటోగ్రఫీని, జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు, అనిల్ కుమార్ పి ఎడిటింగ్, రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్. ఎన్ సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ఎ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్.

బైకర్ యాక్షన్, ఎమోషన్, నోస్టాల్జియాతోకూడిన గ్రిప్పింగ్ రైడ్‌గా ఉంటుంది.