Monday, October 13, 2025
HomeMovie Newsప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ థ్రిల్లింగ్ ఫైనల్ ట్రైలర్ విడుదల

ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ థ్రిల్లింగ్ ఫైనల్ ట్రైలర్ విడుదల

20th సెంచరీ స్టూడియోస్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ ఫైనల్ ట్రైలర్‌ను అధికారికంగా విడుదల చేసింది. డైరెక్టర్ డాన్ ట్రాచ్టెన్‌బర్గ్ ఈ ఐకానిక్ ఫ్రాంచైజీకి కొత్త బోల్డ్ విజన్‌ను అందిస్తున్నారు. ట్రైలర్‌లో ఎక్స్‌ప్లోసివ్ సెట్ పీసెస్, అనూహ్యమైన అలయన్సెస్, ప్రెడేటర్ వర్సెస్ ప్రెడేటర్ బ్యాటిల్స్ లాంటివి ప్రేక్షకులు ఇంతకు ముందు చూడని విధంగా టీజ్ చేస్తున్నాయి. 

- Advertisement -

భవిష్యత్తులో ‘మోస్ట్ డేంజరస్ ప్లానెట్’ పై సెట్ చేయబడిన ఈ చిత్రంలో తన క్లాన్ నుంచి బహిష్కరించబడిన యంగ్ ప్రెడేటర్ (షుస్టర్-కోలోమాటంగి)కు, హాఫ్-డిస్ట్రాయ్డ్ ఆండ్రాయిడ్ థియా (ఫానింగ్)తో అనూహ్యమైన అలయన్స్ ఏర్పడుతుంది. వీరిద్దరూ కలిసి అల్టిమేట్ అడ్వర్సరీని వెతుకుతూ ప్రమాదకరమైన జర్నీకి బయలుదేరుతారు. డెడ్లీ న్యూ క్రీచర్స్, రైవల్ ప్రెడేటర్స్‌తో తమ బలం, లాయల్టీ, సర్వైవల్‌ను పరీక్షించుకుంటారు. 

డాన్ ట్రాచ్టెన్‌బర్గ్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం, జిమ్ థామస్, జాన్ థామస్ సృష్టించిన క్యారెక్టర్ల ఆధారంగా తీర్చిదిద్దబడింది. జాన్ డేవిస్, డాన్ ట్రాచ్టెన్‌బర్గ్, మార్క్ టోబెరాఫ్, బెన్ రోజెన్‌బ్లాట్, బ్రెంట్ ఓ’కానర్ నిర్మాతలు. స్క్రీన్‌ప్లేను డాన్ ట్రాచ్టెన్‌బర్గ్ మరియు పాట్రిక్ ఐసన్ రచించారు. 

20th సెంచరీ స్టూడియోస్ ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్‌ను నవంబర్ 7న ఇండియన్ థియేటర్లలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేస్తోంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read