Movie News

‘పెద్ది’ నుంచి అచ్చియ్యమ్మగా జాన్వీ కపూర్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్నాయి. ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ , వర్కింగ్ స్టిల్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈరోజు, మేకర్స్ రెండు డిఫరెంట్ పోస్టర్ల ద్వారా అచ్చియ్యమ్మగా జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జాన్వీ కపూర్‌ అద్భుతంగా కనిపించింది. రస్టిక్ ప్రింటెడ్‌ చీర, సంప్రదాయ నగలు, సన్‌గ్లాసెస్‌తో స్టైలిష్‌గా మైక్‌ ముందు ధైర్యంగా నిలబడి ఉన్న ఆమె లుక్‌ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. పోస్టర్‌ పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసింది.

రెండో పోస్టర్‌లో బ్లూ చీరలో జీప్‌పై నిలబడి, ధైర్యంగా అభివాదం చేస్తూ కనిపిస్తుంది. ఇది ఆమె పాత్రలోని సోషల్ ఇంపాక్ట్ , ఆత్మవిశ్వాసాన్ని చక్కగా ప్రజెంట్ చేసింది. ఫియర్స్ అండ్ ఫియర్‌లెస్ అనే టైటిల్ కి తగినట్లుగా ఈ పోస్టర్లలో జాన్వీ పూర్తిగా మాసీ లుక్‌తో ఆకట్టుకుంటోంది.

శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి అకాడమీ అవార్డు విన్నర్ ఎఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు, ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు డీవోపీగా పని చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్.

పెద్ది మార్చి 27, 2026న గ్రాండ్ పాన్-ఇండియా విడుదల కానుంది.