మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ దర్శకుడు బుచ్చిబాబు సానా పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ పరిశ్రమ నుంచి అనేక మంది శుభాకాంక్షలు వెల్లువెత్తినప్పటికీ, రామ్ చరణ్ షేర్ చేసిన ప్రత్యేక సందేశం అభిమానులని అలరించింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి రూపొందిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ షూటింగ్ మధ్యలో తీసిన ఒక క్యాండిడ్ మోమెంట్‌ను పంచుకుంటూ, దర్శకుడి అంకితభావాన్ని చరణ్ ప్రశంసించారు.
“నా #Peddi కెప్టెన్ బుచ్చిబాబు సానా గారికి హ్యాపీ బర్త్‌డే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందించిన హృదయపూర్వక బర్త్‌డే విషెస్‌కు దర్శకుడు బుచ్చిబాబు సాన భావోద్వేగంతో స్పందించారు.
‘మీ ఆప్యాయమైన శుభాకాంక్షలకు హృదయపూర్వక ధన్యవాదాలు సర్
‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ డెబ్యూ అందుకున్న బుచ్చిబాబు సానా, భావోద్వేగంతో కూడిన గ్రామీణ కథనాల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సిగ్నేచర్ స్టైల్‌ను కొనసాగిస్తూ, ‘పెద్ది’ ను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఇంటెన్స్, రగ్గడ్ లుక్‌లో పాన్ ఇండియా ఆడియన్స్ ని అలరించబోతున్నారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన గ్లింప్స్, ‘చికిరి చికిరి’ ఫస్ట్ సాంగ్‌కు సెన్సేషనల్ రెస్పాన్స్ రావడంతో ప్రాజెక్ట్‌పై హైప్ మరింత పెరిగింది.
శర వేగంగా ముందుకు సాగుతున్న ఈ యాక్షన్ డ్రామా ఈ సమ్మర్‌లో గొప్ప ఎమోషన్స్ తో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా ఏప్రిల్ 30న థియేటర్లలోకి రానుంది.