Monday, February 16, 2026
HomeMovie Newsపెద్ది దర్శకుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మెగా

పెద్ది దర్శకుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మెగా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ దర్శకుడు బుచ్చిబాబు సానా పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ పరిశ్రమ నుంచి అనేక మంది శుభాకాంక్షలు వెల్లువెత్తినప్పటికీ, రామ్ చరణ్ షేర్ చేసిన ప్రత్యేక సందేశం అభిమానులని అలరించింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి రూపొందిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ షూటింగ్ మధ్యలో తీసిన ఒక క్యాండిడ్ మోమెంట్‌ను పంచుకుంటూ, దర్శకుడి అంకితభావాన్ని చరణ్ ప్రశంసించారు.

- Advertisement -

“నా #Peddi కెప్టెన్ బుచ్చిబాబు సానా గారికి హ్యాపీ బర్త్‌డే! ❤️ సెట్స్‌పై ప్రతి రోజు మీరు చూపించే ప్యాషన్, డీటైలింగ్, రూటెడ్ స్టోరీటెల్లింగ్ ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. మనం కలిసి ఇంకా ఎన్నో మ్యాజికల్ కథలు సృష్టిద్దాం. ఈ సంవత్సరం మీ కష్టానికి తగిన గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను” అంటూ చరణ్ తన శుభాకాంక్షలు వ్యక్తం చేశారు. ఈ సందేశం ఇద్దరి మధ్య ఏర్పడిన బలమైన క్రియేటివ్ బాండింగ్‌ను ప్రజెంట్ చేస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందించిన హృదయపూర్వక బర్త్‌డే విషెస్‌కు దర్శకుడు బుచ్చిబాబు సాన భావోద్వేగంతో స్పందించారు.

‘మీ ఆప్యాయమైన శుభాకాంక్షలకు హృదయపూర్వక ధన్యవాదాలు సర్ 🙏🙏🙏❤️❤️❤️🤗. ఈ ప్రయాణంలో ప్రతిరోజూ మీ నుంచి కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను సర్. ఇది నాకు అమూల్యమైన అనుభవం. ఎడిట్ రూమ్‌లో ప్రతిసారి సినిమా చూస్తున్నప్పుడు మీ నటన మళ్లీ మళ్లీ నన్ను మంత్ర ముగ్ధుణ్ని చేస్తోంది సర్ 🙏. ‘పెద్ది’ పాత్ర చాలా సంవత్సరాల పాటు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది. నిజంగా మనసులని తాకే పాత్రగా మారబోతోంది. నాపై నమ్మకం ఉంచి ఈ ప్రాజెక్ట్ బాధ్యత ఇచ్చినందుకు ఎప్పటికీ మీకు కృతజ్ఞుడిగా ఉంటాను సర్. థ్యాంక్యూ సో మచ్ మై డియరెస్ట్ చరణ్ సర్…లవ్ యూ 🙏❤️❤️❤️❤️🤗

‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ డెబ్యూ అందుకున్న బుచ్చిబాబు సానా, భావోద్వేగంతో కూడిన గ్రామీణ కథనాల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సిగ్నేచర్ స్టైల్‌ను కొనసాగిస్తూ, ‘పెద్ది’ ను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఇంటెన్స్, రగ్గడ్ లుక్‌లో  పాన్ ఇండియా ఆడియన్స్ ని అలరించబోతున్నారు.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన గ్లింప్స్, ‘చికిరి చికిరి’ ఫస్ట్ సాంగ్‌కు సెన్సేషనల్ రెస్పాన్స్ రావడంతో ప్రాజెక్ట్‌పై హైప్ మరింత పెరిగింది.

శర వేగంగా ముందుకు సాగుతున్న ఈ యాక్షన్ డ్రామా ఈ సమ్మర్‌లో గొప్ప ఎమోషన్స్ తో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా ఏప్రిల్ 30న థియేటర్లలోకి రానుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read