సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘పరదా’ ఆగస్ట్ 22న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
పరదా కథ విన్న తర్వాత మీ ఫస్ట్ రియాక్షన్ ఏమిటి?
-పరదా చాలా కొత్త కథ. ఇలాంటి కథలు తెలుగు సినిమాలోనే కాదు ఇండియన్ సినిమాలో కూడా చాలా అరుదు. ఇలాంటి ఫ్రెష్ కాన్సెప్టు నా దగ్గరికి ఎప్పుడు రాలేదు.
-డైరెక్టర్ ప్రవీణ్ నాకు కథ చెప్పినప్పుడు పరదాలోనే నా క్యారెక్టర్ ఎక్కువగా కనిపించింది. బాడీ లాంగ్వేజ్ డైలాగ్ తో ఎలా నటించగలను అనేది ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ సినిమాని చేయడం జరిగింది.
-ఇందులో చాలా సీన్స్ నేను సైలెంట్ గా ఉండొచ్చు. కానీ పరదా వెనుక నా క్యారెక్టర్ ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రీమియర్స్ చూసిన చాలా మంది ఆడియన్స్ నేను కేవలం కళ్ళతోనే కాదు బాడీ లాంగ్వేజ్, వాయిస్ తో కూడా యాక్ట్ చేయగలనని చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. పరదా ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
-ఈ కథ నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది చాలా సోల్ ఫుల్ ఫిలిం. ఒక యాక్టర్ గా ఛాలెంజింగ్ గా ఉండే రోల్ చేశాను.
ఈ సినిమా ప్రమోషన్స్ లో మీరు చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.. కారణం?
-ఈ కథకి నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఒక అమ్మాయి మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలదు. చాలా హానెస్ట్ గా తీసిన సినిమా ఇది. కచ్చితంగా మీరు క్యారెక్టర్స్ తో రిలేట్ అవుతారు.
-సినిమా అంటే ఒక సెలబ్రేషన్. అలాంటి సినిమాలు తో పాటు ఇలా ఒక్కసారి మనల్ని మనం ఆలోచింపజేసుకునే సినిమాలు కూడా రావాలి. మేము ఒక మంచి ప్రయత్నం చేసాము. నిజాయితీగా ఒక కథ చెప్పాము. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం ఉంది.
ఈ సినిమాలో మీరు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిన సీన్?
-రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ కి నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఇప్పటికి కూడా ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు. ఆడియన్స్ చూసినప్పుడు అక్కడ చెప్పిన పక్షి కథ ఖచ్చితంగా మనల్ని ఆలోచనల్లోకి నెట్టేస్తుంది. ఆ సినిమా కథ మొత్తం ఆ సీన్ లోనే ఉంది.
– పరదా ఒక బోల్డ్ అటెంప్ట్. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక్క సెకండ్ ఆలోచించగలిగిన అది సక్సెస్ గా భావిస్తాను.
సంగీత, దర్శన గారి తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
ఇందులో ఒక హోటల్ సీన్ ఉంటుంది, ఆ సీన్ లో మేమందరం గొడవ పడతాము, అలా మొదలైన మా కెమిస్ట్రీ చాలా అద్భుతంగా సాగింది. దర్శన సంగీత తో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈ సినిమాతో మేము చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం.
గోపి సుందర్ మ్యూజిక్ గురించి?
-ఈ సినిమాకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో ఆత్మహుతి సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీన్ లో వచ్చే మ్యూజిక్ అవన్నీ నన్ను కదిలించేసాయి. కారులో కూర్చుని నాలో నేనే ఏడ్చేసాను. చాలా ఎమోషనల్ అయిపోయాను. గోపి సుందర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ప్రతి సాంగ్ కి మీనింగ్ ఉంటుంది. ద బెస్ట్ వర్క్ ఇచ్చారు
ఈ సినిమా గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు?
-తెలుగు సినిమాలో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లోకి ఒక డిఫరెంట్ సినిమా ఇది. మీ ఫ్యామిలీతో వచ్చి చూస్తే ఖచ్చితంగా ఆస్వాదిస్తారని బలంగా నమ్ముతున్నాను.
మీరు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుంది.. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది ?
-అదృష్టంగా భావిస్తున్నాను. మరో స్టేట్ కి వెళ్లి ఇంత ఫేమస్ అవుతానని, ఇలాంటి ఒక లైఫ్ ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఆదరించారు. తెలుగు ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ వల్లే నేను తెలుగు నేర్చుకున్నాను. తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను. తప్పకుండా వారిని అలరించే మరిన్ని అద్భుతమైన సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను.