Movie News

నిర్మాతగా నా స్థాయిని మరింతపెంచే మంచి చిత్రం “మఫ్టీ పోలీస్”

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ – ఐశ్వర్య రాజేష్ ల పోలీస్ ఇన్వెస్టిగేటివ్ పర్సనల్ డ్రామా “తీయవర్ కులై నడుంగ” తెలుగులో “మఫ్టీ పోలీస్”గా రేపు (ఈనెల 21న) ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వంలో జియస్సార్ అర్ట్స్ బ్యానర్ పై జి. అరుల్ కుమార్ నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని… తెలుగులో “మఫ్టీ పోలీస్” పేరుతో ప్రముఖ నిర్మాత ఎ. ఎన్. బాలాజీ… శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా 400 పైచిలుకు చిత్రాలు పంపిణీ చేసి, నిర్మాతగా “రంగం-2, యుద్ధభూమి, ఒరేయ్ బామ్మర్ది, డాక్టర్ 56, మై డియర్ భూతం” వంటి చిత్రాలను అందించిన బాలాజీ… “మఫ్టీ పోలీస్” చిత్రం నిర్మాతగా తన స్థాయిని మరింత పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఒక రచయిత హత్య నేపద్యంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తుందని బాలాజీ పేర్కొన్నారు. ఇటీవలకాలంలో పిల్లల పాలిట భూతంలా మారిన ఆటిజం వ్యాధి గురించి కూడా ఇందులో చర్చించడం, సదరు వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం ఈ చిత్రం ప్రత్యేకత అని ఆయన వివరించారు. యాక్షన్ కింగ్ అర్జున్ – ఐశ్వర్య రాజేష్ అలియాస్ భాగ్యంలకు తెలుగునాట ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అత్యధిక థియేటర్లలో “మఫ్టీ పోలీస్” చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, ఈ సినిమాలో యాక్షన్ తోపాటు పర్సనల్ డ్రామా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందని, తమిళంతోపాటు తెలుగులోనూ అసాధారణ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని శ్రీలక్ష్మీజ్యోతి క్రియేషన్స్ అధినేత ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశాన్ని అందించిన జి.అరుల్ కుమార్ కి, ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు దినేష్ లక్ష్మణన్ లకు బాలాజీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు!!

రామ్ కుమార్ గణేశన్, అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా తదితరులు నటించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ – అప్పాజీ, ఎడిటింగ్: లారెన్స్ కిషోర్, సినిమాటోగ్రఫీ: భరత్ ఆశీనగన్, మ్యూజిక్: శరవణన్ అభిమన్యు, నిర్మాత: జి.అరుల్ కుమార్, రచన – దర్శకత్వం: దినేష్ లక్ష్మణన్, విడుదల; శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ – ఎ. ఎన్. బాలాజీ!!