ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి హై-బడ్జెట్ స్పెక్టికల్ హరి హర వీర మల్లులో నటించిన నటి నిధి అగర్వాల్, ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ రాజా సాబ్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. వరుస ఎక్సయిటింగ్ ప్రాజెక్టులతో తన అభిమానులను అలరుస్తన్న నిధి అగర్వాల్ ఇప్పుడు ఓ గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్ కి సైన్ చేశారు. నిధి అగర్వాల్ లీడ్ రోల్ లో చేస్తున్న ఈ సినిమాని తన పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ కింద శ్రీ పుప్పాల అప్పల రాజు (ఎ.ఆర్.) నిర్మిస్తున్నారు, ఇది వారి ప్రొడక్షన్ నంబర్ 1. ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా నిఖిల్ కార్తీక్.ఎన్ అరంగేట్రం చేస్తున్నారు.

నిధి స్పెషల్ డేను సెలబ్రేట్ చేస్తూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ద్వారా నిధికి విషెస్ చెప్తూ, రాబోయే సినిమా హారర్ థ్రిల్ ని ముందుగానే టోన్ సెట్ చేశారు. ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కనుంది. టాప్ టెక్నికల్ స్టాండర్డ్స్, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఆడియన్స్ కి విజువల్లీ స్ట్రాంగ్, ఎమోషనల్ గా ఇంటెన్స్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతోంది

ప్రొడ్యూసర్ పుప్పాల అప్పల రాజు మాట్లాడుతూ.. నిధి అగర్వాల్ తన క్యారెక్టర్ కి అద్భుతమైన చార్మ్ తీసుకోస్తున్నారు. ఈ సినిమా ఆమె కెరీర్ లో ఓ మైలురాయి అవుతుంది. మా ప్రొడక్షన్ హౌస్ లో ఆమె జాయిన్ అవ్వడం మాకు ఆనందం కలిగిస్తోంది. ఆమె బిగ్ స్క్రీన్ పై చూపించబోయే మేజిక్ కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం.
ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రాబోతున్నాయి. టైటిల్ దసరా సందర్భం గా రివీల్ చేస్తారు.