Movie News

నయనతారపై రేపటి నుంచి సాంగ్ షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ప్రస్తుతం, చిరంజీవి, నయనతార, ఇతర ప్రధాన తారాగణం కీలకమైన టాకీ పార్ట్ షూటింగ్ లో బిజీగా వున్నారు. 

రేపటి నుంచి మెగాస్టార్ చిరంజీవి, నయనతారలపై ఒక పాటను హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. చార్ట్‌బస్టర్, మాస్-అప్పీల్ ట్రాక్‌లను అందించడంలో పాపులరైన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్‌ను రూపొందించారు. ఈ పాటను డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి కొరియోగ్రఫీ చేస్తారు.

ఫస్ట్ లుక్, గ్లింప్స్, వినాయక చవితి స్పెషల్ పోస్టర్ అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. చిరంజీవిని స్టైలిష్ బెస్ట్ అవతార్‌లో ప్రజెంట్ చేయడం అభిమానులని అలరించింది. 

ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా, ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలుగా ఉన్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు.

మేకర్స్ ఇటివలే అనౌన్స్ చేసినట్లుగా..మన శంకర వర ప్రసాద్ గారు 2026 సంక్రాంతి పండుగకు వస్తున్నారు.