వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా మూవీ డ్యూడ్‌తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ‘ప్రేమలు’ అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.
ఫస్ట్ సింగిల్ – బూమ్ బూమ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటని సాయి అభ్యాంకర్ స్వరపరిచి పాడారు. ఎనర్జీటిక్ బీట్స్,ఆకట్టుకునే సాహిత్యంతో ఈ సాంగ్ యూత్ కి అద్భుతంగా కనెక్ట్ అవుతుంది.

సేనాపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ చాలా ఫ్రెష్ గా వున్నాయి. దీప్తి సురేష్, భూమిక, సాయితో కలిసి అలపించిన పాట యూత్ ఫుల్ వైబ్ తో అదిరిపోయింది. విజువల్స్, సరదాగా గడిపే ఫ్రెండ్స్ గ్యాంగ్, ప్రదీప్ , మమిత కెమిస్ట్రీ, స్టైలిష్ డ్యాన్స్ మూవ్‌లతో సాంగ్ చాలా ట్రెండీగా వుంది.
ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్, లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్. భరత్ విక్రమన్ ఎడిటర్.

ఈ దీపావళికి డ్యూడ్ కలర్‌ఫుల్, మ్యూజిక్‌తో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం , కన్నడ భాషలలో విడుదల కానుంది.