Movie News

డైరెక్టర్ బాబీ కొల్లి ఓ భారీ KVN ప్రొడక్షన్స్‌తో చేతులు కలిపారు

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ బాబీ కొల్లి తన తర్వాతి సినిమాను ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్యానర్ KVN ప్రొడక్షన్స్‌తో చేయబోతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ బాబీ పుట్టినరోజు సందర్బంగా రావడంతో ఆయన అభిమానులకు ఇది డబుల్ సెలబ్రేషన్‌గా మారింది.

అద్భుతమైన కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ అందించే బాబీ, పెద్ద హీరోల కోసం పవర్‌ఫుల్ రోల్స్ రాసే మాస్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య బ్లాక్‌బస్టర్ తర్వాత, ఇటీవల బాలకృష్ణతో చేసిన డాకూ మహారాజ్ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో, బాబీ తర్వాతి ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడాయి.

బాబీ తన కొత్త చిత్రాన్ని బిగ్ స్కేల్ లో చేయబోతున్నారు. భారీ బడ్జెట్‌తో, ప్యాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కబోయే ఈ ఎంటర్టైనర్‌కు టాక్సిక్, ఖైదీ 2 లాంటి భారీ ప్రాజెక్టులు చేస్తున్న KVN ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.  

యూనివర్సల్ అట్రాక్షన్ ఉన్న ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ ఇప్పటికే రెడీ చేశారు బాబీ. ప్రీ-ప్రొడక్షన్ కూడా జోరుగా సాగుతుంది. బాబీ క్రియేటివ్ విజన్‌, KVN బిగ్ స్కేల్ ప్రొడక్షన్ తో ఈ సినిమా సంచలనం క్రియేట్ చేయబోతోంది. 

హీరో, టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలో అనౌన్స్ చేస్తారు. ఈ సినిమా బాబీ కెరీర్‌లో మరో మైల్ స్టోన్ గా నిలవబోతుంది.