Movie News

‘డకాయిట్’ ఉగాది కానుకగా రిలీజ్

అడివి శేష్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘డకాయిట్’ లీడ్ క్యారెక్టర్స్ ని పరిచయం చేసిన ఫైర్ గ్లింప్స్ రిలీజ్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ప్రేమ-ప్రతీకార కథనం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.

మేకర్స్ తాజాగా డకాయిట్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. 2026 ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమా విడుదల కానుంది. అడివి శేష్, మృణాల్‌ ఠాకూర్‌ ఇంటెన్స్ లుక్స్ లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది.  

ఇప్పటికే విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్‌ విజువల్స్ తో ఆకట్టుకుంది. నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజువల్ గా ఫైర్ గ్లింప్స్ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.  

బాలీవుడ్‌ దర్శక, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన నటిస్తున్న తొలి తెలుగు చిత్రం డకాయిట్ కావడం విశేషం.

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ భారీ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాత. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.