Movie News

‘జూనియర్’ హైలీ ఎంటర్‌టైనింగ్ ట్రైలర్‌

‘జూనియర్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌లోకి అరంగేట్రం చేస్తున్న కిరీటి రెడ్డి టీజర్‌లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఈ యూత్ అండ్ హై-ఎనర్జీ ఎంటర్‌టైనర్ కు రాధా కృష్ణ దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించారు. జూలై 18న రిలీజ్ కానుండటంతో టీం ప్రమోషన్స్ దూకుడు పెంచింది. పాటలు కూడా చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ఈరోజు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

అభిని తల్లిదండ్రులు చాలా గారభంగా చూసుకుంటారు. తండ్రి అభిని ఎంతో ప్రేమతో చూస్తాడు. కాలేజ్‌కి వచ్చిన తర్వాత క్లాస్‌మేట్ స్పూర్తిని ప్రేమించేస్తాడు. అప్పటి వరకు అభి జీవితం హ్యాపీగా, ఎలాంటి బాధ్యతలూ లేకుండా సాగుతుంది. కానీ, తన తండ్రి ఊరిలో ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న తర్వాత జీవితం పూర్తిగా మారుతుంది.

దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్, మంచి ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా బ్లెండ్ చేశారు. ఫాదర్-సన్ ఎమోషనల్ ట్రాక్, జెనీలియా పాత్ర, ఊరి బ్యాక్‌డ్రాప్ ఇవన్నీ కలిపి ఈ సినిమాను ఒక మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌కి నచ్చే కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా నిలబెట్టాయి.

కిరీటి రెడ్డి తన తొలి సినిమాతోనే చాలా మెచ్యూర్‌గా, వర్సటైల్‌గా కనిపించే పాత్రను చేయడం విశేషం. నిజంగా డ్రీమ్ డెబ్యూట్ అనొచ్చు. చాలా న్యాచురల్‌గా నటించాడు. శ్రీలీల తన స్క్రీన్‌ ప్రజెన్స్ తో ఎనర్జీ తీసుకొచ్చారు. వైవా హర్ష, సత్యల కామెడీ టైమింగ్  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జెనీలియా ప్రజెంన్స్ చాలా స్పెషల్ గా వుంది. కిరీటి తండ్రిగా డాక్టర్ రవిచంద్ర వి ఎమోషనల్ డెఫ్త్ తీసుకొచ్చారు.

సినిమాటోగ్రాఫర్ కె.కె. సెన్తిల్ కుమార్ విజువల్స్‌ కళ్లకు విందుగా, గ్రాండ్‌గా వున్నాయి. డీఎస్పీ సంగీతం ఓ రేంజ్‌లో ఉంది. ప్రతి సీన్‌కి సరిపోయేలా ఎమోషన్స్‌ని పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్‌ను పీటర్ హైన్ అద్భుతంగా డిజైన్‌ చేశారు. ప్రొడక్షన్ డిజైన్‌కి రవీందర్, ఎడిటింగ్‌ను నిరంజన్ దేవరమనే బెస్ట్ వర్క్ ఇచ్చారు. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

వారాహి చలన చిత్రం ప్రొడక్షన్ విలువలు అద్భుతంగా వున్నాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ క్వాలిటీ కనిపిస్తుంది.

మొత్తానికి ట్రైలర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరింత పెంచింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది.