మెగా ఫ్యాన్స్‌కి మళ్లీ పండగ వాతావరణం వచ్చేసింది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ స్పెషల్ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్లతో పాటు సెలబ్రిటీ ట్రైనర్ రాకేష్ ఉదయార్ కూడా ఉన్నారు.
ఈ ముగ్గురు మెగా హీరోలు ఫిట్‌నెస్‌కి ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రామ్ చరణ్ తన కఠినమైన వర్కౌట్ రొటీన్‌తో ఫిట్‌నెస్ ఐకాన్‌గా మారిపోయారు. వరుణ్ తేజ్ తన హైట్, మసిల్స్‌తో యంగ్‌స్టర్స్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కూడా ప్రమాదం తర్వాత తిరిగి ఫిట్‌నెస్‌ను సాధించి, తాను ఎంత దృఢంగా ముందుకెళ్తున్నాడో చూపించారు.
ఈ ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో దర్శనమివ్వడం మెగా ఫ్యాన్స్‌కి పెద్ద సర్‌ప్రైజ్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మెగా హీరోలు సినిమాలతోనే కాదు, ఫిట్‌నెస్‌లో కూడా రోల్ మోడల్స్‌గా నిలుస్తున్నారు.