71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా “బేబి” సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో డైరెక్టర్ సాయి రాజేశ్, ఉత్తమ గాయకుడిగా పీవీఎన్ ఎస్ రోహిత్ నేషనల్ అవార్డ్స్ స్వీకరించారు. హృద్యమైన ప్రేమ కథను తన స్క్రీన్ ప్లేలో అందంగా మలచిన సాయి రాజేశ్ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా, ప్రేమిస్తున్నా అనే పాటను మనసుకు హత్తుకునేలా పాడిన సింగర్ పీవీఎన్ ఎస్ రోహిత్ బెస్ట్ సింగర్ గా నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు. రెండు జాతీయ అవార్డ్స్ సాధించి తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని దేశవ్యాప్తంగా మరింతగా పెంచారు “బేబి” సినిమా టీమ్.
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ “బేబి” చిత్రాన్ని రూపొందించారు. కల్ట్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకుల మనసుల్ని గెల్చుకున్న ఈ సినిమా… బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల గ్రాసర్ గా నిలిచింది. ప్రస్తుతం “బేబి” సినిమా హిందీలో రీమేక్ అవుతోంది.