నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో నవ దళపతి సుధీర్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మాకు బ్లెస్స్ చేయడానికి వచ్చిన గెస్ట్ లందరికీ పేరుపేరునా థాంక్యూ సో మచ్. అభిమానులందరికీ థాంక్యూ సో మచ్. ఈరోజు కొన్నినిజాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సుధీర్ బాబు అంటే ఎవరు? ఈ ప్రశ్న నన్ను నేను చాలాసార్లు అడిగాను. కృష్ణ గారి అల్లుడు, మహేష్ బాబు గారి బావ. ఇది నేను గర్వంగా ప్రేమగా ఒప్పుకుంటున్నాను. నేను యాక్టర్ అవ్వాలనుకున్న మూమెంట్ తలచుకుంటే భయమేస్తుంది. యాక్టర్ అవ్వాలని కోరుకునే పర్మినెంట్గా చంపేయాలనుకున్నాను. ఎందుకంటే కోరిక ఎంత బలంగా ఉందో రెస్పాన్సిబిలిటీ కూడా అంతే ఉంది. యాక్టర్ గా సక్సెస్ అవుతానా? ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? ఇలా చాలా భయాలు ఉండేవి. కాకపోతే నేను మొండి వాడిని. ఒక స్పోర్ట్స్ పర్సన్ ని. మా ఇంట్లో అమ్మానాన్న ప్రయత్నించడమే నేర్పించారు. ఆగిపోవడం ఎప్పుడూ నేర్పించలేదు. కృష్ణ గారి అల్లుడు, మహేష్ గారి బావగానే ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఎంతోమంది నిర్మాతలను కలిసాను. అడిషన్స్ ఇచ్చాను. యాక్షన్ వీడియోలు పట్టుకుని ప్రతి ఆఫీస్ కి తిరిగాను. నాకు దొరికింది ఒక ఎక్స్ట్రా గా ఒక కాఫీ మాత్రమే. అంతకుమించి నేను ఏది కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు.
కృష్ణానగర్ కష్టాలు తెలియకకోవచ్చు కానీ ఫిలింనగర్ బాధలు తెలుసు. తిండి లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలియదు గానీ, కళ్ళ ఎదురుగా తిండి వుండి నిరాశతో ముద్ద దిగిన ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. బస్సులో నేను ట్రావెల్ చేయకపోవచ్చు. కానీ కారులో కూర్చుని ఏడవడం తెలుసు. ఇవన్నీ నేను సింపతి కోసం చెప్పట్లేదు. అలా అయితే నా మొదటి సినిమా అప్పుడే చెప్పేవాడిని. ఇప్పుడు నాకు సింపతీ అవసరం లేదు. ప్రేమ గౌరవం చాలు. మీరందరూ మహేష్ బాబు గారిపై ప్రేమతోనే వచ్చారు. అందరికీ థాంక్యూ సో మచ్. కానీ ఇందులో ఎవరో ఒకరు ఏదో మూలన నాకోసం వచ్చి ఉంటారు. నా కోసం చప్పట్లు కొట్టి ఉంటారు. నాకు మనసుకు తెలుస్తుంది. ఎవరో ఒకరు నా కోసమైతే వచ్చారు. మీ కష్టపడతాను. కానీ ఆ ఒక్కడి కోసం ప్రాణం పెట్టేస్తాను. గెలిచే వరకు కూడా పోరాడాలి. లేదా చచ్చే వరకు పోరాడాలి. జటాధరలో డైలాగ్ ఇది. నా రియల్ లైఫ్ లో కూడా యూజ్ అవుతుంది. ఒక్క సినిమా చాలు అనుకున్న వాడిని 20 సినిమాలు చేశాను. అందులో హిట్లు ఉన్నాయి ప్లాపులు ఉన్నాయి. ఈ 20 సినిమాల్లో హిట్టుకు కారణం నా కష్టం.ఫ్లాఫ్ కి కారణం కూడా అది నా ఫెయిల్యూరే. మహేష్ గారు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా ఏ ఒక్క రోజు కూడా హెల్ప్ చేయమని అడగలేదు. ఏ ఒక్క నిర్మాతని ఒక్క రూపాయి కూడా ఎక్కువ అడగలేదు. ఏ నిర్మాతను కూడా ఒక ఫైట్ పెట్టండి డాన్స్ పెట్టండి అని అడగలేదు. ఈ 20 సినిమాలు చేయడానికి కారణం ఒక్కటే. కృష్ణ గారి అల్లుడు, మహేష్ గారి బావ.. సుధీర్ బాబు. చాలామంది నెపోకిడ్ అని అంటున్నారు. నిజానికి అలాంటిది ఏమీ లేదు. ఇవన్నీ మనస్పూర్తిగా మీతో చెప్పాలనిపించింది.
జటాధర నేను చేసిన 20 సినిమాల్లో ది బెస్ట్ స్క్రిప్ట్. సినిమా చూస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టర్ ఏ హీరో చేయలేదు. ఘోస్ట్ హంటర్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. కాకపోతే దెయ్యాలపై తనకి నమ్మకం ఉండదు. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ధనపిశాచి బ్యాక్గ్రౌండ్ తీసుకుని డైరెక్టర్ వెంకట్ చాలా అద్భుతంగా ఈ సినిమాను తీశారు. ఈ సినిమా దెయ్యాలు దేవుడు ఉన్నాయని నమ్మేవారికి, లేవని నమ్మేవారికి ఇద్దరికీ సమానంగా నచ్చుతుంది. ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ తో చెప్పడం జరిగింది. నవంబర్ 7న అందరు సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నిర్మాత ప్రేరణ నా దగ్గరికి వచ్చి ఈ కథ చెప్పినప్పుడు తను నా అభిమానం అని చెప్పింది. నాతో నువ్వు నానితో సినిమా చేయాలని చెప్పింది. తను చాలా సక్సెస్ఫుల్ సినిమాలు చేసింది. తను తెలుగులో సినిమా చేయడం తెలుగు సినిమాకి ఒక మంచి అడ్వాంటేజ్. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయి. డైరెక్టర్ వెంకట్ అభిషేక్ ఈ స్క్రిప్ట్ ని చాలా అద్భుతంగా తీశారు. సమీర్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. రాజీవ్ ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా కోసం శివతాండవం చేయడం అద్భుతమైన అనుభూతి. ఇదంతా ఆ శివుని దీవెనలుగా భావిస్తున్నాను. సందీప్ చాలా అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాలో ఒక 15 నిమిషాల సీక్వెన్స్ ఉంటుంది. అందరికీ గుజ్బంస్ తెప్పిస్తుంది. సోనాక్షి చాలా పవర్ ఫుల్ రోల్ చేశారు. ఈ సినిమాల్లో పని చేసిన ప్రతి టెక్నీషియన్, నటీనటులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నవంబర్ 7న అందరూ రెడీ అయిపోండి. ఫ్యామిలీ డ్రామా, శివతాండవం.. ఇలా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. కార్తికేయలో కృష్ణుని గురించి చెప్పే ఒక ఎపిసోడ్ ఉంటుంది. అలానే ఈ సినిమాలో కూడా శివుని గురించి చాలా మంచి ఎపిసోడ్స్ ఉంటాయి. అరుణాచలం వెళ్లే వాళ్ళు ఈ సినిమా ఇంకా అద్భుతంగా కనెక్ట్ అవుతారు. అందరూ నవంబర్ 7న జటాధర సినిమాకి వెళ్లాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యు.

డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ… అందరికి నమస్కారం. సుదీర్ గారి కొత్త సినిమా ట్రైలర్ టీజర్ ఏది రిలీజ్ అయిన అందులో ఆయన హార్డ్ వర్క్ కనిపిస్తుంది. ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన ఖచ్చితంగా హిట్ అవ్వాలని పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. జటాధర టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఈ సినిమా అద్భుతంగా ఆడాలని ఆ పరమశివుని వేడుకుంటున్నాను. ప్రేరణ శివిన్ కి ఆల్ ది వెరీ బెస్ట్. ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ షాట్ అదిరిపోయింది. టెక్నికల్గా బ్రిలియంట్ అనిపిస్తుంది, ట్రైలర్ చూస్తుంటే థియేటర్స్ లో చూడాల్సిన సినిమా అనిపిస్తుంది. నవంబర్ 7న రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ వెళ్లి థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.
శిల్పా శిరోద్కర్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ప్రేరణ సుధీర్ బాబు అందరికీ థాంక్యు. సుధీర్ బాబు మాకు ఫ్యామిలీ. మా ఫ్యామిలీకి జనరేషన్స్ గా మీరు సపోర్ట్ ని అందిస్తున్నారు. నవంబర్ 7న కూడా మీ అందరి సపోర్టు ఉండాలని కోరుకుంటున్నాను. చాలా ప్రేమతో చేసాం. సుధీర్ బాబు గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ట్రైలర్ లో చివరి షాట్ మెస్మరైజింగ్ గా ఉంది. మీ అందరూ కూడా చాలా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. మేమందరం మహేష్ బాబు గారి సినిమా కోసం ఎదురు చూస్తున్నాం. అంతకంటే ముందు ఈ సినిమాని మీరందరూ కూడా చూడాలని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ శివిన్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కి కృతజ్ఞతల. ప్రేరణకి తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం.మాకు తెలుగు సినిమా అంటే గౌరవం. ఇక్కడ చాలా కష్టపడి పాషన్ తో సినిమాలు చేస్తారు. సుధీర్ బాబు గారు అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు .సోనాక్షి శిల్పా గారి క్యారెక్టర్స్ కూడా మీ అందరిని అలరిస్తాయి. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నవంబర్ 7న అందరం థియేటర్స్ లో కలుద్దాం.
నిర్మాత ప్రేరణ అరోరా మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మా చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర జి, జీ స్టూడియోస్ ఉమేష్ బన్సల్ గారికి, ఉత్తమ్ గారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాకు తెలుగు సినిమా, తెలుగు పరిశ్రమ అంటే చాలా ఇష్టం. మహేష్ బాబు గారికి సుదీర్ బాబు గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని. సుధీర్ బాబు గారు నా ఫస్ట్ తెలుగు యాక్టర్. ఆయన సపోర్ట్ కి కృతజ్ఞతలు. శిల్ప గారు చాలా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.
డైరెక్టర్ యదువంశీ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా టైటిల్ ట్రైలర్ చూడగానే వచ్చాయి గూస్ బంప్స్ వచ్చాయి.సుధీర్ బాబు గారికి నేను పెద్ద అభిమానిని. ఎస్ఎంఎస్ సినిమా నుంచి ఇప్పటివరకు ఆయన డెడికేషన్ ని చూస్తూ వస్తున్నాను. ఆయన డాన్స్ యాక్షన్ చాలామందికి ఇన్స్పిరేషన్. ఈ ట్రైలర్లో లాస్ట్ షాట్ చూసిన తర్వాత నిజంగానే గూజ్ బంప్స్ వచ్చాయి, ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ప్రొడ్యూసర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ.. సుదీర్ బాబు గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ అఫ్ ది మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్టర్. ఏ ప్రాజెక్ట్ తీసుకున్న చాలా పాసినేట్ గా వర్క్ చేస్తారు. ఈ సబ్జెక్ట్ గురించి నాకు ముందే ఒకసారి చెప్పారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ రాజీవ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నాకు ఈ అవకాశం నిర్మాతలకి ధన్యవాదాలు. సుధీర్ అన్న పర్ఫామెన్స్ ఇరగదీశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది. మూవీ యూనిట్ అందరూ పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

