Movie News

చైనాలో 40 వేల థియేటర్లలో విడుదల కాబోతున్న విజయ్ మూవీ

విజయ్ సేతుపతి కెరీర్‌లో ఎంతో ప్రత్యేకతను కలిగించిన మహారాజా చిత్రం కేవలం తమిళ సినీ ప్రియులకే కాకుండా పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించి, ఇప్పుడు అంతర్జాతీయంగా తన ప్రభావాన్ని చూపుతోంది. మహారాజా చిత్రాన్ని కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.107 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం గమనార్హం. ఇది విజయ్ సేతుపతి నటనతో పాటు దర్శకుడు నిథిలన్ స్వామినాథన్‌ దిరెచ్తిఒన్ ను అబ్బురపరిచింది. సింపుల్ రివేంజ్ స్టోరీకి అద్భుతమైన ట్విస్టులు జతచేసి, ఆసాంతం ఉత్కంఠభరితంగా ఈ సినిమాను రూపొందించారు. ముఖ్యంగా విజయ్ సేతుపతి నటన కథకు ప్రాణంగా నిలిచింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్‌గా కనిపించి, తన శక్తివంతమైన నటనతో సినిమాకు మరో స్థాయి తెచ్చాడు.

నవంబర్ 29న ఈ చిత్రం చైనాలో భారీ స్థాయిలో 40 వేల స్క్రీన్లలో విడుదలకు సిద్ధమైంది. యి షి ఫిల్మ్స్ మరియు అలీబాబా పిక్చర్స్ ఈ చిత్రాన్ని చైనా ఆడియెన్స్‌కు అందిస్తున్నారు. ఇది సాధారణ విషయమేం కాదు.. చైనాలో భారతీయ చిత్రాలకు ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఓ ప్రయత్నం. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం, డిజిటల్ వేదికపై కూడా విశేషమైన స్పందన అందుకుంది. మహారాజా చిత్రం సృష్టించిన ఈ బజ్ విజయ్ సేతుపతి అభిమానులకే కాకుండా, తమిళ చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తోంది. చైనాలో ఈ సినిమా ఎలా ఆడుతుందో చూడాలి.