Movie News

చంద్రకళగా ది బ్యూటిఫుల్ అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ రిలీజ్

యంగ్ హీరో రోషన్ ప్రస్తుతం తన లేటెస్ట్ ఫిల్మ్ ఛాంపియన్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాను , జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఛాంపియన్ ఫస్ట్ లుక్, ఆసక్తికరమైన టీజర్ గ్లింప్స్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.  మేకర్స్ ఇప్పుడు సినిమా హీరోయిన్ ను పరిచయం చేశారు.

స్వప్న సినిమాస్ కొత్త ట్యాలెంట్ ని వెలుగులోకి తీసుకురావడంలో ముందువరుసలో వుంటుంది. బ్లాక్‌బస్టర్ సీతా రామంతో తెలుగులోకి అడుగుపెట్టిన మృణాల్ ఠాకూర్ అందుకు నిదర్శనం. ఇప్పుడు ఆమె పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న నటీమణులలో ఒకరు. ఆ ట్రెడిషన్ ని కొనసాగిస్తూ, ఛాంపియన్‌లో ట్యాలెంటెడ్ మలయాళ నటి అనస్వర రాజన్‌ను పరిచయం చేస్తోంది.

ఆమె పుట్టినరోజు సందర్భంగా, చంద్రకళగా అనశ్వర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. సాంప్రదాయ రెట్రో-స్టైల్ దుస్తులలో గాజులు, సిందూరంతో అందంగా కనిపించింది. కథలో  ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాత్రను ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమౌతోంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్. మాధీ , సంగీతం మిక్కీ జె. మేయర్. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి.

ఇతర తారాగణం, సిబ్బంది వివరాలు త్వరలో తెలిజేస్తారు.