Movie News

#గోపీచంద్33 భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

మాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #గోపీచంద్33లో నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.  పవన్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ఇప్పటికే నాలుగు షెడ్యూల్‌లు, 55 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హీరో గోపిచంద్‌తో పాటు ప్రధాన తారాగణంపై వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో  మెయిన్  హైలైట్‌గా నిలుస్తుంది. ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.  

ఇప్పటికే గోపిచంద్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్, గ్లింప్స్ వీడియోకు అద్భుతమైన స్పందన లభించింది. యోధుడిలా కనిపించిన గోపిచంద్ తన పాత్రలోని ఇంటెన్స్ ని ప్రజెంట్ చేశారు.

విభిన్నమైన కథలతో, సాంకేతిక నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి, ఈ చిత్రంతో భారత చరిత్రలోని ప్రాముఖ్యమైన అధ్యాయాన్ని వెండితెరపైకి తెస్తున్నారు. అద్భుతమైన ఎమోషన్స్, విజువల్ గ్రాండ్యూర్ తో ప్రేక్షకులకు ఒక వినూత్న అనుభూతిని అందించబోతున్నారు. గోపిచంద్ తన కెరీర్‌లో ఎన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు.

టాప్  టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. సౌందర్ రాజన్ కెమెరామ్యాన్ కాగా అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.