Movie News

కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన ఉన్ని ముకుందన్

సినీ ఇండస్ట్రీలో బిగ్ అనౌన్స్‌మెంట్. లెజెండరీ డైరెక్టర్ జోషీ ఓ హై-ఒక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ కి మెగాఫోన్ పట్టేందుకు సిద్ధం అయ్యారు. ఉన్ని ముకుందన్ ఫిలింస్ (UMF) & ఐన్స్టిన్ మీడియా బ్యానర్లపై ఈ సినిమా రాబోతుంది.

డైరెక్టర్ జోషీ పుట్టినరోజునే ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్లు తర తరాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఇప్పుడు ఆ అనుభవంతో, ఈ తరం స్టోరీ టెల్లింగ్ పవర్‌తో, ఒక భారీ యాక్షన్ మూవీ తీసేందుకు రెడీ అవుతున్నారు.

నేషనల్ అవార్డు గెలుచుకున్న ‘మెప్పడియాన్’ తర్వాత వంద కోట్ల గ్రాస్ కలెక్షన్‌తో దూసుకెళ్లిన ‘మార్కో’ వంటి సినిమాలతో UMF స్టాండర్డ్‌ను నెస్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. ఇప్పుడు జోషీ లాంటి మాస్టర్ డైరెక్టర్‌తో చేతులు కలపడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

అభిలాష్ ఎన్. చంద్రన్ ఈ సినిమాకి కథ & స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు . ‘పొరించు మరిఅమ్ జోస్’, ‘కింగ్ ఆఫ్ కొథా’ వంటి సినిమాలకు రాసిన ఈయన ఎమోషన్ & డెప్త్ ఉన్న క్యారెక్టర్‌లు రాయడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా కూడా యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలుతో ఉండబోతోంది. 

హీరోగా ఉన్ని ముకుందన్ తన కెరీర్‌లో ఎప్పుడూ చూడని లుక్‌లో, మాస్ యాక్షన్ అవతారంలో కనిపించబోతున్నాడు.  

“Driven by Passion, Now Fuelled by Ego” అనే నినాదంతో UMF – ఫ్యామిలీస్ & యూత్ రెండింటినీ అలరిస్తూపవర్ఫుల్ కథలతో ముందుకెళ్తోంది.

 ఈ సినిమా నిర్మాణంలో భాగమైన ఐన్స్టిన్ మీడియా ఇటీవలే ‘ఆంటోనీ’, ‘పురుష ప్రేతం’ వంటి యూనిక్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్స్, క్వాలిటీ కంటెంట్‌కి పేరు తెచ్చుకున్న ఈ బ్యానర్ కూడా ఈ సినిమాతో సత్తా చాటబోతోంది.

UMF & Einstin Media సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ సినిమా… బిగ్ పాన్-ఇండియా ఎంటర్టైనర్‌గా నిలవబోతోంది.