Movie News

కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, నటుడు, డైలాగ్ రైటర్ గురు ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులోని తన నివాసంలో ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు. ప్రాథమిక దర్యాప్తులో, ఆయన రెండుమూడు రోజుల క్రితం చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. గురు ప్రసాద్ ఆత్మహత్యకు కారణం ఇంకా తెలియరాలేదు.

గురు ప్రసాద్ తన రచనా ప్రతిభతో “మఠం,” “ఎద్దేలు మంజునాథ,” “రంగనాయక” వంటి ఎన్నో విశిష్ట చిత్రాలకు దర్శకత్వం వహించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డును అందుకున్నారు. ఆయన “బాడీగార్డ్,” “కుష్క,” “విజిల్,” “హుడుగురు,” “మైలారీ,” “జిగర్తాండ” వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అలాగే, “హుడుగారు,” “విజిల్,” “సూపర్ రంగా” వంటి చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా కూడా పనిచేశారు. గురు ప్రసాద్ మరణం కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఆయన అకాల మరణంపై ప్రముఖులు, సహచర నటులు, దర్శకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.