News

“ఓ చెలియా” సినిమా ఫస్ట్ లుక్ విడుదల

ఓ చెలియా” చిత్రం ఎస్ ఆర్ ఎస్ క్రియేషన్స్ పతాకంపై రూపా శ్రీ మరియు చంద్రమౌళి నిర్మించారు. ఈ చిత్రంలో నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య ముఖ్య పాత్రల్లో నటించారు. చిత్రానికి దర్శకత్వం వహించిన నాగ రాజశేఖర్.

ఓ చెలియా చిత్రం ఫస్ట్ లుక్‌ను జూబ్లీహిల్స్ రోడ్డు నం. 5లోని హైరిస్ స్టూడియోలో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు రూపా శ్రీ మరియు చంద్రమౌళి మాట్లాడుతూ, “డైరెక్టర్ నాగ రాజశేఖర్ ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరో నాగ ప్రణవ్ ఈ సినిమాలో ప్రత్యేకంగా కనిపించారు. హీరోయిన్‌గా కావేరి కర్ణిక, ఆద్య అద్భుతంగా పనిచేశారు,” అన్నారు.

ఈ చిత్రం మార్చ్ 2025లో విడుదల కానుంది.

డైరెక్టర్ నాగ రాజశేఖర్: “ఈ సినిమా కథ చాలా బాగా నచ్చింది. నా సహకారంతో చిత్రాన్ని రూపొందించాం. నాగ ప్రణవ్ తన మొదటి సినిమాగా కానీ సీనియర్ నటుల్లా నటించాడు. కావేరి కర్ణిక, ఆద్య కూడా బాగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్. ఎం. కుమార్ మంచి పాటలు ఇచ్చారు,” అని తెలిపారు.

హీరో నాగ ప్రణవ్: “ఓ చెలియా ఒక అద్భుతమైన లవ్ స్టోరీ. ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని నాకు నమ్మకం ఉంది,” అన్నారు.

హీరోయిన్ కావేరి కర్ణిక: “ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడం నాకు కొత్త అనుభవం. నాకు ఈ కథ చాలా నచ్చింది. కెమెరామెన్ సురేష్ బాల నన్ను అందంగా చూపించారు,” అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్. ఎం. కుమార్: “ఈ చిత్రానికి మంచి పాటలు ఇచ్చాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, సరిగ్గా మ్యూజిక్ రాబట్టాం,” అన్నారు.

కెమెరామెన్ సురేష్ బాల: “ఈ చిత్రం గొప్ప కథతో రూపొందింది. నాకు తెలుగు సినిమా కెమెరామెన్‌గా పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది,” అన్నారు.

స్పెషల్ రోల్ లో అజయ్ ఘోష్, కుడితి శ్రీనివాస్, సతీష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.