తమన్నా భాటియా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఓదెల 2. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం తమన్నా నాగ సాధువుగా అదరగొట్టారు. వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లలో ఒకటిగా ఏప్రిల్ 17న విడుదలైన ఓదెల2 అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
సక్సెస్ ప్రెస్ మీట్ లో మూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ.. మేము ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసిన ఆడియన్స్ కి థాంక్యూ. మేము ఆశించిన రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి రావడం చాలా ఆనందంగా ఉంది. తమన్నా నాగ సాధువుగా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై చాలా అంచనాల ఏర్పడ్డాయి. తన పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి హైలైట్ గా ఉండబోతుందని మేము ముందే చెప్పాము. అది ఈరోజు ఆడియన్స్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. తమన్నా వశిష్ట సింహ మధ్య పోటాపోటీ పెర్ఫార్మన్స్ ఉంటుందని చెప్పాము. అది ఈరోజు ఆడియన్స్ విట్నెస్ చేస్తున్నారు. ఇది ముఖ్యంగా లేడీస్ తో ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఈరోజు ఒక ప్రీమియర్ లాగా మొదలైంది. శుక్రవారం నుంచి ఈ సినిమా సునామీ మొదలు కాబోతుంది. శివశక్తిగా తమన్నా చేసే అసలైన రచ్చ శుక్రవారం నుంచి మొదలు కాబోతుంది. ఈ వారాంతం మీ ఫ్యామిలీతో కలిసి వచ్చి ఈ సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ సినిమాలో సైకిల్ ఎపిసోడ్, క్లైమాక్స్ లో వచ్చే రెండు సర్ప్రైజ్ ఎలిమెంట్స్, అలాగే మరికొన్ని సీక్వెన్స్లు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేయబోతున్నాయి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ తో థియేటర్స్ నుంచి బయటికి రండి. ఈ సినిమాకి చాలా సక్సెస్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ కి థాంక్స్ చెప్పాలని ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.ఈ సినిమాని దీవించిన శివునికి, ప్రేక్షక దేవుళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’అన్నారు.
ప్రొడ్యూసర్ డి మధు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సుదర్శన్ 35 ఎంఎం లో ఈ సినిమాని ప్రేక్షకులతో కలిసి చూశాను. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయింది. ముఖ్యంగా లేడీస్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. డివైన్ ఫుల్ క్యారెక్టర్ లో తమన్నా గారు అద్భుతంగా చేశారు. అలాగే వశిష్ట కూడా పోటాపోటీగా చేశాడు. ఇది మర్చిపోలేని రోజు. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ముందు ముందు ఇంకా గొప్ప సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి’అన్నారు.

వశిష్ట ఎన్ సింహ మాట్లాడుతూ.. ఇది నాకు చాలా స్పెషల్ డే. థియేటర్స్ లో ఆడియోస్ తో కూర్చుని ఈ సినిమా చూశాను. ఆడియన్స్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. శివతాండవం థియేటర్స్ లో మొదలైంది. దాని విశ్వరూపం రేపట్నుంచి అందరికీ అర్థమవుతుంది. అందరికీ తెలుస్తుంది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ’అన్నారు