Friday, September 5, 2025
HomeMovie Newsఇది నాకు కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది-మనోజ్

ఇది నాకు కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది-మనోజ్

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్‌’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా రాకింగ్ స్టార్ మనోజ్ మంచు విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.  

- Advertisement -

మిరాయ్ ప్రాజెక్ట్ అప్రోచ్ ఎలా జరిగింది?
-నాకు కార్తిక్ గారు ఎప్పటినుంచో తెలుసు. అలాగే తేజ చిన్నప్పటి నుంచి తెలుసు. తను చాలా క్యూట్ గా ఉంటాడు. ఎక్కడ కనిపించినా బుగ్గలు గిల్లేసేవాడిని(నవ్వుతూ). తను ఒక ఈవెంట్ కలిసినప్పుడు ‘మంచి స్క్రిప్ట్ వుంటే కలిసి సినిమా చేద్దాం తమ్ముడు’అని చెప్పాను. ‘నిజమా అన్నా’అన్నాడు. ఓ రోజు మా గేమింగ్ స్టూడియోలో వున్నప్పుడు తేజ వచ్చి మిరాయ్ గురించి చెప్పాడు. కథ, మా ఇద్దరి పాత్రల గురించి ఇప్పుడే ఎక్కువ రివిల్ చేయకూడదు. కార్తిక్ గారు చెప్పిన కథ చాలా నచ్చింది.

-శ్రీరాముల వారి నేపధ్యం, తొమ్మిది పుస్తకాల బ్యాక్ డ్రాప్, ఇతిహాసల కోణం చాలా అద్భుతంగా వుంటుంది. ఇందులో నా క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా వుంటుంది. లేజీగా వుండేవాడు బ్రతకకూడదనే క్యారెక్టర్. కార్తిక్ గారు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. చాలా స్పెషల్ కేర్ తీసుకున్నాం.

ఇందులో మీ క్యారెక్టర్ మోడరన్ రావణ అనుకోవచ్చా?
-అనుకోవచ్చు. కానీ ఆడవారి జోలికి వెళ్లడు. (నవ్వుతూ)

ఈ సినిమా కోసం ఎలాంటి హోమ్ వర్క్ చేశారు?
దాదాపు ఈ సినిమా మూడేళ్ళు పెట్టాం. డైరెక్టర్ ప్రతి విషయంలో చాలా డిటెయిల్ గా వున్నారు. ప్రతి డీటెయిల్ ని ఆయన మోనిటర్ చేసుకుంటారు. ఈ విషయంలో మొత్తం క్రెడిట్ డైరెక్టర్ గారికి ఇవ్వాలి.

రజినీకాంత్ గారిని కలిసారు కదా..  
-రజినీకాంత్ గారిని కూలికి ముందు కలిసాను. మిరాయ్ ట్రైలర్ చూపించాను. ఆయనకు చాలా నచ్చింది. ఇలాగే కంటిన్యూ చెయ్, గ్యాప్ లేకుండా సినిమాలు చేయమని చెప్పారు. చాలా ఎంకరేజ్ చేశారు. మంచి ఎనర్జీ ఇచ్చారు.  

ఈ సినిమా కోసం ప్రత్యేకంగా యాక్షన్ శిక్షణ తీసుకున్నారా?
– మిరాయ్ యాక్షన్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. అలాగే నాకు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అలవాటు.  హైదరాబాదులో జాక్సన్ మాస్టర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. దాదాపు 8 నెలల ప్రాక్టీస్ చేశాను. మిరాయ్ నా కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది.

-తేజ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. యాక్షన్ ఇంటెన్స్ గా ప్రాక్టీస్ చేశాడు. సినిమా చూస్తున్నప్పుడు తన హార్డ్ వర్క్ మీకు కనిపిస్తుంది.  

డైరెక్టర్ కార్తీక్ గురించి?
-కార్తీక్ గ్రేట్ టెక్నీషియన్. ఇదే కంటెంట్ ని మరో డైరెక్టర్ చేస్తే మాత్రం ఈ బడ్జెట్ లో అవ్వదు. తన అనుభవంతో కార్తీక్ హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని తీశారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను.

నిర్మాత విశ్వప్రసాద్ గారి సపోర్ట్ గురించి?
విశ్వ ప్రసాద్ గారి విజన్ అప్రిషియేట్ చేయాలి. ఆయన పని రాక్షసుడు. చాలా గ్రాండ్ స్కేల్లో సినిమా తీశారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు.

-ఈ సినిమా దాదాపుగా అన్ని లైవ్ లొకేషన్ లోనే షూట్ చేశాం. రియల్ లొకేషన్స్ లో గ్రాఫిక్స్ ని వాడి సినిమా ఎక్స్పీరియన్స్ ని మరింతగా అన్హాన్స్ చేశాం. ఇందులో యాక్షన్స్ అంతా లైవ్ గా వుంటుంది

ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?
-నా లైఫ్ లో హైయస్ట్ రెస్పాన్స్ వచ్చిన ట్రైలర్ ఇది. ఇనిషియల్ డేస్ లో మిస్టర్ నూకయ్య, నేను మీకు తెలుసా సినిమాలకు కూడా చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఈ స్కేల్లో సినిమా రావడం, ప్రపంచంలో నలుమూలల నుంచి రెస్పాన్స్  రావడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇంత అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి రుణపడి ఉంటాను.

కొత్తగా చేస్తున్న సినిమాలు గురించి?
-డేవిడ్ రెడ్డి, రక్షక్ సినిమాలో జరుగుతున్నాయి. ఈ రెండు కూడా హై ఇంటర్సిటీ యాక్షన్ ఉన్న సినిమాలు. అలాగే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న స్క్రిప్ట్ కోసం కూడా చూస్తున్నాను. ప్రస్తుతం డేవిడ్ రెడ్డి వర్క్ షాప్స్ జరుగుతున్నాయి.

-తమిళ్ నుంచి కూడా కొన్ని కథలు వస్తున్నాయి. ఒక నటుడిగా అన్ని భాషల్లో సినిమాలు చేయాలని ఉంటుంది.

-అహం బ్రహ్మాస్మి సినిమా కూడా సమయం వచ్చినప్పుడు వస్తుంది. అలాగే వాట్ ద ఫిష్ సినిమా కూడా చేయాలి. చాలా డార్క్ కామెడీ ఉన్న సినిమా అది. ఆ సినిమాని ఫారిన్ లొకేషన్స్ లో వింటర్ సమ్మర్ రెండు సీజన్స్ లో తీయాలి. ఆ సినిమా ఎప్పుడు వచ్చినా అద్భుతంగా ఉంటుంది.

-నేను మీకు తెలుసా టీం తో ఒక సినిమా చేయాలని ఆలోచన ఉంది. త్వరలో ఒక అనౌన్స్మెంట్ ఇస్తాము.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read