Saturday, May 17, 2025
HomeMovie Newsఆడియన్స్ కి బిగ్ థాంక్ యూ-అల్లు అరవింద్

ఆడియన్స్ కి బిగ్ థాంక్ యూ-అల్లు అరవింద్

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు,  ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ #సింగిల్. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు.  మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అందరినీ అలరించి సమ్మర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు.

- Advertisement -

#సింగిల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ సినిమా రసెస్ చూసిన తర్వాత శ్రీవిష్ణుని పిలిచి గీత ఆర్ట్స్ లో  మరో రెండు సినిమాలు చేయాలని చెక్ ఇచ్చాను. మనిషిగా యాక్టర్ గా తను అంత నచ్చాడు. సినిమా బాగుంటే మేము థియేటర్స్ కి వస్తాము అని నిరూపించిన ఆడియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. డైరెక్టర్ కార్తీక్ రాజు అద్భుతంగా ఈ సినిమాని తీశారు. విష్ణుతో నా ప్రయాణం ఇంకా ముందు ముందు ఉంటుంది. తను డైలాగ్ డైలాగ్ కి మధ్య చెప్పిన డైలాగు అర్థం చేసుకోవడం నావల్ల కాలేదు( నవ్వుతూ) వెన్నెల కిషోర్ ఈ సినిమాతో కొంచెం దగ్గర అయ్యారు. వ్యక్తిగత సలహాలు తీసుకోవడం దగ్గర వరకు వచ్చింది. కేతిక ఇవాన ఫెంటాస్టిక్ గా పెర్ఫాం చేశారు. విశాల్ చంద్రశేఖర్ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చాలా ఎంగేజింగ్ గా చేశారు. యువ దర్శకులంతా వచ్చి ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేయడం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది. వారందరికీ థాంక్యూ. విద్య మా అమ్మాయి. తను ఈ సినిమాతో విజయాన్ని అందుకోవడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో పని చేసిన టెక్నీషియన్స్ కి నటీనటులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సమ్మర్లో థియేటర్స్ కి వచ్చి అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్న  ఆడియన్స్ అందరికీ థాంక్యూ సో మచ్’అన్నారు.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ… మూడేళ్ల క్రితం ఈ కథని డైరెక్టర్ కార్తీక్ రాజుగారు నాకు చెప్పడం జరిగింది. అంతకుముందు ఈ కథని ఒక 15 మంది రిజెక్ట్ చేశారు వాళ్లందరికీ కూడా థాంక్యూ (నవ్వుతూ). సినిమాని చాలా కసిగా చేసాం. నా కసిలో పాలుపంచుకున్న వెన్నెల కిషోర్ గారికి థాంక్యూ (నవ్వుతూ) అరవింద్ గారు విద్య గారు రియాజ్ గారు భాను గారు సినిమా బిగినింగ్ నుంచి చాలా సపోర్ట్ చేశారు. మంచి టీం తో చేస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ కొడితే బావుంటుందని అనుకున్నాను అది జరిగింది. దేవుడు ఉన్నాడు. హానెస్ట్ గా సిన్సియర్ గా ఏది చేసినా దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఈ సినిమా విజయం, అరవింద్ గారితో జర్నీ చాలా ఎంజాయ్ చేశాను. ఇది విద్యా గారి కోసమైనా సక్సెస్ అయిపోవాలని బలంగా అనుకున్నాను. డైరెక్టర్ కార్తీక్ రాజు గారితో వర్క్ చేయడం చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మా డైరెక్షన్ టీమ్ అందరికీ థాంక్యు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆడియన్స్ కి చాలా థాంక్యూ ఈ సినిమాకి అద్భుతంగా సపోర్ట్ చేసిన మీడియా మిత్రులు అందరికీ థాంక్యు. కేతిక ఇవాళ ఆ క్యారెక్టర్స్ కి లైఫ్ తీసుకొచ్చారు. వాళ్ళు చాలా మంచి మంచి సినిమాలు చేసి ఇంకా పెద్దపెద్ద హిట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని జనం చూస్తూనే ఉంటారు. సినిమాని చాలా రోజులు ఎంజాయ్ చేస్తారు. ముందు చెప్పినట్లు కేవలం నవ్వుకోవడానికే తీసిన సినిమా ఇది. మీరంతా థియేటర్స్ కొచ్చి ఇంతలా నవ్వుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆడియన్స్ కి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు’అన్నారు

వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. అల్లు అరవింద్ గారితో టైం స్పెండ్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఆయన ప్రతి సమస్యకి అద్భుతమైన సొల్యూషన్ ఇస్తారు. డైరెక్టర్ కార్తీక్ వెరీ జెన్యూన్ పర్సన్. సినిమాని చాలా హానెస్ట్ గా తీశారు. శ్రీ విష్ణు గారితో జర్నీ మర్చిపోలేను. ఈ సినిమా మొదటి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇందులో సెకండ్ హీరో మీరే అని చెప్పారు. ఆయన లాంటి వ్యక్తి చాలా అరుదు. ఆయన లేకపోతే అరవింద్ క్యారెక్టర్ కి ఇంత మంచి ఎలివేషన్ రాదు. ఆయనతో మరిన్ని సినిమాలో పనిచేయాలని ఉంది. ఇవాన కేతిక ఫెంటాస్టిక్ గా పెర్ఫార్మ్ చేశారు. నిర్మాతలకి థాంక్యూ టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

ప్రొడ్యూసర్ విద్య మాట్లాడుతూ… ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ మామకి థాంక్యూ సో మచ్. ఇంత మంచి సమ్మర్  హిట్ చేసిన ఆడియన్స్ కి మీడియా కి థాంక్యూ. విష్ణు గారు వెన్నెల కిషోర్ గారు గ్యాప్ లేకుండా ఆడియన్స్ ని నవ్వించారు. కేతిక ఇవాన అద్భుతంగా నటించారు. టీమ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. టీమ్ అందరికీ థాంక్యూ’

డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. సింగిల్ టీమ్ అందరికీ బిగ్ కంగ్రాట్యులేషన్స్. ఈరోజుల్లో ఆడియన్స్ ని థియేటర్స్లోకి తీసుకురావడం అంత ఈజీ కాదు. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. డైరెక్టర్ కార్తీక్ కి బిగ్ కంగ్రాజులేషన్స్. అల్లు అరవింద్ గారు చాలా పాజిటివ్ పర్సన్. ఆయనతో ట్రావెల్ చేస్తుంటే జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆయన ఇచ్చే ఎనర్జీ అద్భుతం.ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్స్ చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు వెన్నెల శ్రీ విష్ణు గారు, కిషోర్ అదరగొట్టేసారు. వాళ్ల ఎనర్జీ మెస్మరైజ్ చేసింది. శ్రీ విష్ణును చూస్తే విజయ్ సేతుపతిలా ఎంటర్టైన్ చేస్తున్న శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ కి థాంక్యూ.నిర్మాతలకి ఆల్ ది వెరీ బెస్ట్. ఇంత మంచి ప్రొడ్యూసర్స్ ని ఇండస్ట్రీకి ఇచ్చిన అరవింద్ గారికి థాంక్యూ. హ్యాట్రిక్ కొట్టిన గీత ఆర్ట్స్ కి బిగ్ కంగ్రాజులేషన్స్’అన్నారు.

హీరోయిన్ కేతిక శర్మ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి థాంక్యూ. నిర్మాతలకు ధన్యవాదాలు.  ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ గారికి థాంక్యూ. శ్రీ విష్ణు గారు నా ఫేవరెట్ కోస్టార్. ఆయన చేస్తున్న సినిమాలు పట్ల నాకు చాలా గౌరవం ఉంది. టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ’అన్నారు

ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్… అయ్ తండేల్ సింగిల్ సినిమాలతో హ్యాట్రిక్ సాధించిన గీత ఆర్ట్స్ కి బిగ్ కంగ్రాట్యులేషన్స్. గీతా ఆర్ట్స్  ఎప్పుడు సీజన్స్ ని నమ్మదు కంటెంట్ అనే రీసన్ ని నమ్ముతుంది. గీత ఆర్ట్స్ ఎప్పుడు టాలెంట్ నే ఎంకరేజ్ చేస్తుంది. అందుకు అరవింద్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా చూస్తున్నప్పుడు థియేటర్స్ లో జనం విజల్స్ కొట్టి అరుస్తున్నారు. థియేటర్స్ లో అలాంటి వైబ్ చూడ్డం చాలా కష్టం. కంటెంట్ ఉంటే అలాంటి నవ్వులు వస్తాయి. డైరెక్టర్ కార్తీక్ రాజు తెలుగు పల్స్ ని చాలా అద్భుతంగా పట్టుకొని ఈ సినిమా తీశారు. ఈ సినిమాతో ఘనవిజయం అందుకున్న అందరికీ థాంక్యు కంగ్రాజులేషన్స్. ఇప్పుడున్న చాలామంది ప్రామిసింగ్ డైరెక్టర్స్ శ్రీ విష్ణు గారు హీరోగా చేసిన సినిమాలతోనే వచ్చారు. అంత మంచి టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొత్త ప్రతిభని ఇండస్ట్రీ లోకి తీసుకొస్తున్న శ్రీ విష్ణు గారికి థాంక్స్. సింగిల్ సక్సెస్ మరింత అద్భుతంగా ఆడుతుందని కోరుకుంటున్నాను’అన్నారు

ప్రొడ్యూసర్ బన్నీ వాసు మాట్లాడుతూ… ఈ వేదికపై నుంచి అల్లు అరవింద్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన ఇచ్చే సపోర్ట్ తోనే ఇక్కడ ఉన్నాం. సింగిల్ సినిమా అద్భుతంగా ధియేటర్స్ లో రన్ అవుతుంది అంటే దానికి కారణం శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ గారు డైరెక్టర్ కార్తీక్ రాజు. ఈ సినిమా విజయం టోటల్ ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడింది. ఈ సినిమా ఈ మంత్ ని సేవ్ చేసింది. ధియేటర్లో డైలాగులు కంటే నవ్వులు ఎక్కువ వినిపిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అయినట్లే సింగిల్ సినిమాలో కూడా చాలామంది ఆడియన్స్ మాకు డైలాగులు వినిపించడం లేదు పక్కన కూర్చున్న వారి నవ్వులే వినిపిస్తున్నాయని చెప్పారు. అదే సక్సెస్ కి నిదర్శనం. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్’అన్నారు  

డైరెక్టర్ కార్తీక్ రాజు మాట్లాడుతూ… అల్లు అరవింద్ గారికి నిర్మాతలకు ధన్యవాదాలు. శ్రీ విష్ణు గారికి మూడేళ్ల క్రితంకథ  చెప్పాను అప్పటినుంచి ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేశారు. కిషోర్ గారికి నేను బిగ్ ఫ్యాన్ ని. ఆయన్ను ఊహించే ఆ క్యారెక్టర్ రాసుకున్నాను ఆయన సపోర్టు మర్చిపోలేను. ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాని నా జీవితాంతం మర్చిపోలేను.

ప్రొడ్యూసర్ భాను మాట్లాడుతూ.. సినిమాకి ఇంత మంచి సక్సెస్ చేసిన ఆడియన్స్ కి థాంక్యూ వెరీ మచ్. వాసు గారికి విష్ణు గారికి థాంక్యూ. అరవింద్ గారు మాకు గాడ్ ఫాదర్.  ఆయన  లేకపోతే మేము ఈ స్టేజ్ పై ఉండేవాళ్ళం కాదు.వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

ప్రొడ్యూసర్ రియాజ్ మాట్లాడుతూ.. ముందుగా అల్లు అరవింద్ గారికి థాంక్యూ. ఇది ఆయనతో నాకు మూడో సినిమా చాలా సక్సెస్ఫుల్ జర్నీ. గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. విద్య గారికి వాసు గారికి థాంక్యూ. శ్రీ విష్ణు గారు వెన్నెల కిషోర్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ… అరవింద్ గారికి బిగ్గెస్ట్ కంగ్రాట్యులేషన్స్. సక్సెస్ అనేది ఇండస్ట్రీకి ఇప్పుడు చాలా అవసరం ఇలాంటి సమయంలో గీతా ఆర్ట్స్ నుంచి రెండు హిట్స్ కొట్టారు. విష్ణు నాకు చాలా క్లోజ్ బడ్డీ.  తను కనిపెట్టిన లాంగ్వేజ్  ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఉంది. విష్ణు లో చాలా పొటెన్షియల్ ఉంది. కచ్చితంగా తన టైమింగ్ నేను ఫ్యూచర్ లో వాడుకుంటాను. శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ టైమింగ్ అదిరిపోయింది. కిషోర్  ఈ సినిమాని చాలా చక్కగా ప్రమోట్ చేశాడు. ప్రతి సినిమాని సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. తప్పకుండా ఈ సినిమాని సమ్మర్ లో చూడండి.

డైరెక్టర్ తిరుమల కిషోర్ మాట్లాడుతూ… సింగిల్ సినిమా చూశాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాను. శ్రీ విష్ణు కిషోర్ గారి  టైమింగ్ అద్భుతం. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్.

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. సింగిల్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్. ఈ సినిమాలో శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ గారి టైమింగ్ అదిరిపోయింది.  శ్రీవిష్ణు సక్సెస్ ని దర్శకులు వాళ్ళ సినిమా సక్సెస్ అయినట్టు భావిస్తారు. బ్రోచేవారు కథని నమ్మింది శ్రీ విష్ణు. ఆ సినిమాకు వచ్చిన అప్రిసియేషన్ అంతా శ్రీ విష్ణు కే దక్కుతుంది. అంత ధైర్యాన్ని ఇచ్చిన శ్రీ విష్ణు కి థాంక్యూ

డైరెక్టర్  హసిత్ గోలి మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో ఇంత మంచి హిలేరియస్ ఎంటర్టైన్ రావడం సింగిల్ తోనే జరిగింది. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా సినిమాని తీశారు. విష్ణు ఎనర్జీని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.మంచి బ్లాక్ బస్టర్ కొట్టిన టీమ్ అందరికీ థాంక్యూ అందరికీ ఆల్ ది బెస్ట్ .  

డైరెక్టర్ రామ్ అబ్బరాజు మాట్లాడుతూ.. శ్రీవిష్ణు సినిమా సక్సెస్ అంటే నాకు పర్సనల్ సక్సెస్ లాగా అనిపిస్తుంది. టీం అందరికీ కంగ్రాట్స్. ప్రతి ఫ్రైడే ఇలానే ఒక మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను.

మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం డైరెక్టర్ కార్తీక్ రాజు గారికి థాంక్యూ. ఆయన వల్లే ఈ ప్రాజెక్టులోకి వచ్చాను. నా మ్యూజిక్ టీమ్ అందరికీ థాంక్యూ. ఈ సినిమా నాకు చాలా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ చేశారు. సినిమా ఎంత మంచి ఘనవిజయం సాధించడం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాలో నన్ను భాగం చేసిన అల్లు అరవింద్ గారికి థాంక్యూ’అన్నారు. ఈ సక్సెస్ మీట్ మూవీ టీం అంతా పాల్గొన్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read