Tuesday, December 24, 2024
HomeMovie Newsఅన్నపూర్ణ స్టూడియో లో నాగ చైతన్య వివాహ ఏర్పాట్లు

అన్నపూర్ణ స్టూడియో లో నాగ చైతన్య వివాహ ఏర్పాట్లు

- Advertisement -

నాగచైతన్య – శోభిత దూళిపాళ ఏడు అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థా వేడుక జరుగగా..ఇప్పుడు వివాహ తంతు మొదలుకాబోతుంది. మొదట్లో వీరి పెళ్లి రాజస్థాన్‌లో జరుగుతుందని వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు ఈ వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతున్నట్లు సమాచారం.

పెళ్లి కోసం ప్రత్యేకంగా ఓ మండపాన్ని నిర్మిస్తున్నారట. దీనికి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ పని చేస్తున్నారు. డిసెంబర్ 4న ఈ పెళ్లి జరగనుంది. నాగచైతన్య ఇప్పటికే కొంత మంది స్నేహితులకు వెడ్డింగ్ ఇన్విటేషన్స్ పంపించారని తెలిసింది. ఇటు శోభిత దూళిపాళ కుటుంబం కూడా పెళ్లి పనులను ప్రారంభించారని, ఆ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాగచైతన్య ప్రస్తుతం నటిస్తున్న ‘తండేల్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ మరియు బన్నీవాస్ నిర్మిస్తున్నారు, ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read