Thursday, December 26, 2024
HomeMovie Newsస్మోకింగ్ అలవాటుపై షారుఖ్ కీలక ప్రకటన

స్మోకింగ్ అలవాటుపై షారుఖ్ కీలక ప్రకటన

- Advertisement -

‘బాలీవుడ్ బాద్‌షా’ షారుఖ్ ఖాన్ 59వ పుట్టిన రోజును ఈ శనివారం (నవంబర్ 2) జరుపుకున్నారు. తన అభిమానులతో కలిసి బాంద్రాలో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో ఆయన కొన్ని కీలకమైన ప్రకటనలు చేశారు. ఇకపై స్మోకింగ్ చేయబోనని వెల్లడించారు. ‘‘మీతో పంచుకునేందుకు ఒక మంచి విషయం ఉంది. అబ్బాయిలూ.. ఇకపై నేను స్మోకింగ్ చేయను.

ఈ అలవాటు మానేసిన తర్వాత ఊపిరి పీల్చుకోలేనేమో అనిపిస్తోంది. కానీ అల్లాహ్ దయతో అది సమసిపోతుంది’’ అని షారుఖ్ ఖాన్ వ్యాఖ్యానించాడు. పుట్టిన రోజు ఉదయం తన పిల్లలతో జరిగిన సంఘటనల గురించి సరదాగా పంచుకున్నారు. “నిన్న రాత్రి ఆలస్యంగా డిన్నర్ జరిగింది. ఈరోజు ఉదయం ఆలస్యంగా మేల్కొన్నాను. నా చిన్న కొడుక్కు ఐ-ప్యాడ్ పని చేయడం లేదట. నా కూతురు దుస్తులు మంచిగా లేవని చెప్పింది. పెద్ద కొడుకు విషయానికి వస్తే, ఇక చెప్పాల్సిన అవసరం లేదు” అని చమత్కారంగా తెలిపారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read