Thursday, February 19, 2026
HomeMovie Newsసరికొత్త రియాలిటీ షో అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

సరికొత్త రియాలిటీ షో అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

జియోహాట్‌స్టార్ ఈరోజు తన సరికొత్త రియాలిటీ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌’ ను అనౌన్స్ చేసింది. ప్రేమ, విశ్వాసం, పార్ట్‌నర్‌షిప్ ని ఒకే ఇంటి కింద పరీక్షించే సరికొత్త బోల్డ్ రియాలిటీ ఫార్మాట్‌గా ఈ షోను రూపొందించారు.

- Advertisement -

“ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్” పేరుతో వస్తున్న ఈ షోలో 10 మంది సెలబ్రిటీ జంటలు ఒక అద్భుతమైన విల్లాలో 70 రోజుల పాటు కలిసి ఉండబోతున్నారు. భావోద్వేగాలు ఉప్పొంగే ఈ ప్రయాణంలో రిలేషన్షిప్ బలం, అనురాగం, నమ్మకం, మోడరన్ ప్రేమలోని విభిన్న కోణాలను “మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్” ఆవిష్కరించనుంది.

”10 Celebrity Couples. 70 Days. One Villa.” అనే ఆసక్తికరమైన లైన్‌తో సోషల్ మీడియాలో టీజర్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ షో పాల్గొనే జంటలు ఎవరు? వాళ్లను ఎదురుచూస్తున్న సవాళ్లు ఏమిటి? అని అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

రోమాన్స్, డ్రామా, భావోద్వేగ క్షణాలు, అనూహ్య ట్విస్ట్స్‌తో ప్రేక్షకులను మొదటి రోజునుంచే ఆకట్టుకునేలా ఈ షో రూపొందించబడింది. టఫ్ టాస్కులు, రిలేషన్షిప్ ని పరీక్షించే నిర్ణయాత్మక పరిస్థితులు ఇదివరకు ఎన్నడూ చూడని ఎక్స్ పీరియన్స్ ని అందించబోతున్నాయి.

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రీమియర్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

మరిన్ని అప్డేట్స్ కోసం జియోహాట్‌స్టార్ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఫాలో అవ్వండి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read