Tuesday, December 24, 2024
HomeMovie Newsపుష్ప 2 రిలీజ్ వాయిదా..? నిర్మాతలు ఏమంటున్నారంటే..!!

పుష్ప 2 రిలీజ్ వాయిదా..? నిర్మాతలు ఏమంటున్నారంటే..!!

- Advertisement -

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న “పుష్ప 2: ది రూల్” కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందని మేకర్స్ అధికారికంగా నిర్ధారించారు. కాగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం అందర్నీ షాక్ కు గురి చేస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదనే ఆ కారణంగా పుష్ప 2 రిలీజ్ వాయిదా పడబోతుందంటూ సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొట్టడం మొదలయ్యాయి. దీంతో మేకర్స్ ఈ వార్తలను ఖండించారు.

డిసెంబర్ 05 నే సినిమా రిలీజ్ అవుతుందని..ఈ విషయంలో అస్సలు తగ్గేదేలే” అనే క్యాప్షన్‌తో వాయిదా వార్తలను ఖండించారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. అమెరికాలో డిసెంబర్ 4 సాయంత్రం నుంచే ప్రీమియర్ల ద్వారా అభిమానులు సినిమాను చూడబోతున్నారు. ఓవర్సీస్‌లో ఈ సినిమా కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి ప్రదేశాల్లో రికార్డు స్థాయిలో టికెట్లు బుక్ అవుతున్నాయి. “పుష్ప 2” గురించి పెరుగుతున్న హైప్‌ చూస్తుంటే, ఇది మరోసారి బాక్సాఫీస్‌పై దుమ్ము రేపడం ఖాయమని అర్థమవుతోంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read