సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలర్ పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ‘పరదా’ ఆగస్ట్ 22న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఈ ప్రాజెక్టు ఆలోచన ఎప్పుడు మొదలైంది ?
-ఈ కథ ఆలోచన నాకు ఎప్పటినుంచో ఉంది. నేను దుల్కర్ గారితో ఒక సినిమా చేయాలి. కానీ కొన్ని కారణాల వలన సినిమా కుదరలేదు. విజయ్ గారు సినిమా బండి సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయన ఒక కొత్త బ్యానర్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. అప్పుడు ఆయనకి పరదా కథ చెప్పాను. ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు. అనుపమ గారికి ఈ కథ చెప్పాము. కథ వినగానే అనుపమ గారు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి సినిమా నేను చేయాలని అనుకుంటున్నాను అని చెప్పారు. తర్వాత దర్శన గారు సంగీత గారు ప్రాజెక్టులకు వచ్చారు.
-ఈ సినిమా కోసం చాలా వర్క్ చేసాము. దాదాపు మూడేళ్లు పట్టింది మనాలి, ధర్మశాల ఇలా ఎన్నో అద్భుతమైన లొకేషన్ లో వందమంది క్రూ తో కలిసి ఈ సినిమాని షూట్ చేశాము. గౌతమ్ మేనన్ గారు రాజేంద్రప్రసాద్ గారు, రాగ్ మయూర్ ఇలా చాలా పెద్ద కాన్వాస్ ఉంది. వరకు ఇది బాహుబలి లాంటి ప్రాజెక్టు. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీకు ప్రతిసారి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ వస్తూనే ఉంటాయి.
రివ్యూస్ నచ్చితేనే సినిమాకి వెళ్ళమని చెప్పారు. అంత నమ్మకం ఏమిటి?
-సినిమాకి ఆడియన్స్ న్యాయ నిర్ణీతలు. రివ్యూస్ ఎలా వచ్చిన సరే వాటిని మేము యాక్సెప్ట్ చేస్తాము. సినిమాలో ఏముందో జెన్యూన్ గా అదే చెప్తారని నమ్ముతున్నాను. రివ్యూస్ చూసే థియేటర్స్ కి రండి. మాకు సినిమా మీద పూర్తి నమ్మకం ఉంది. సినిమా చూసినవారు నచ్చితే తప్పకుండా మీ రెస్పాన్స్ ని షేర్ చేయండి.
-ఎక్కడ గ్రీన్ మ్యాట్ వాడకుండా రియల్ లొకేషన్ లోకి వెళ్లి షూట్ చేసినసినిమా ఇది. ప్రేక్షకులకి గ్రేట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ప్యాషన్ తో చేసిన సినిమా. ఈ సినిమా చూసి నేను విజువల్ గా పెద్ద సినిమాలు కూడా హ్యాండిల్ చేయగలనని నమ్మకాన్ని ప్రేక్షకులు కల్పిస్తే చాలా హ్యాపీగా ఫీలౌతాను.
రాగ్ మయూర్ మీ లక్కీ చార్మ్ నా?
నా మూడు సినిమాల్లో తను ఉన్నాడు. శుభం లో చాలా సర్ప్రైజ్ గా తన క్యారెక్టర్ కుదిరింది. పరదా లో కూడా తన క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది.
ట్రైలర్ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?
ట్రైలర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ కూడా చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ రెస్పాండ్ అవుతున్నారు. ప్రస్తుతానికి నాకు అన్ని వైపుల నుంచి చాలా పాజిటివ్ గా ఉంది.
ఈ సినిమాలో ఇంకేదో క్యారెక్టర్ ని దాస్తున్నట్లుగా అనిపిస్తుంది?
కచ్చితంగా దాస్తున్నాం అది మీరు సినిమాలోనే చూడాలి (నవ్వుతూ)
పరదా ప్రమోషన్స్ని చాలా యూనియ్ గా చేస్తున్నారు.. ఈ ఆలోచన ఎవరిది ?
-ఈ సినిమాని కొత్తగా ప్రమోట్ చేయాలని ఆలోచన ఎప్పటినుంచో ఉండింది. అనుపమ థియేటర్స్ కి వెళ్లి పరదా వేసుకుని రీల్స్ చేసి రిలీజ్ చేయడం, అలాగే వైజాగ్ లో ర్యాలీ చేయడం ఇవన్నీ కూడా తన భుజాన వేసుకుని నడిపిస్తుంది. సినిమా మాకు అంత నమ్మకాన్ని ఇచ్చింది. చాలా మంచి సినిమా తీశాం. జనాల్లోకి తీసుకువెళ్తే కచ్చితంగా ఆదరిస్తారు అనే నమ్మకంతో ముందుకు వెళుతున్నాం.
– ఇందులో అనుపమని గొప్ప పెర్ఫార్మర్ గా చూస్తారు. ఇప్పటివరకు చూసిన అనుపమ వేరు ఈ సినిమాలో చూసే అనుపమ వేరు.
-ఇది సినిమా చూస్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చాలా విషయాలు రిలేట్ అవుతారు. తెలుగులో ఈ సినిమా చాలా స్పెషల్ ఫిల్మ్ అవుతుందని నమ్మకం ఉంది.

ఇది నిజంగా జరిగిన కథ అలాంటి ఊరు ఉందా?
ఇది ఫిక్షనల్ స్టొరీ. కానీ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ ఉన్నాయి. ఇందులో ఒక విషయాన్ని దాచాం. అది మీరు సినిమా చూస్తున్నప్పుడే తెలుస్తుంది. మేము ఒక ఫిక్షనల్ ఊరుని క్రియేట్ చేసినప్పటికీ సమాజంలో జరిగిన సంఘటనల ఇన్స్పిరేషన్స్ మీకు తెరపై కనిపిస్తుంది ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్లలో కూడా ఒక పరదా ఉంటుందని ఈ సినిమా ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఈ సినిమా ఒక చర్చకు తావిస్తోంది. జనం మాట్లాడుకునే సినిమా అవుతుంది.
చాలా కష్టమైన లొకేషన్స్ లో ఈ సినిమా తీసినట్లుగా ఉంది?
అవునండి. ఈ సినిమా కోసం చాలా తిరిగాం. మనాలిలో ఉంటూ అక్కడ నుంచి ఎంతోదూరం ప్రయాణించి అద్భుతమైన లొకేషన్స్ ని తీసాం. ఆడియన్స్ కి ఒక రియల్ సినిమా ఇవ్వాలని ఉద్దేశంతోనే అంత కష్టపడ్డాము.
గోపిసుందర్ మ్యూజిక్ గురించి ?
గోపి సుందర్ గారు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. ఆయన ఈ కథ విని చాలా సర్ప్రైజ్ అయ్యారు.ఈ సినిమాని మలయాళం లో కూడా ప్రమోట్ చేస్తున్నాము అక్కడ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత మలయాళం ఆడియన్స్ తెలుగు సినిమాలు కంటెంట్ సినిమాలు అంటారని భావిస్తున్నాను. గోపీసుందర్ గారి మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్.
– మృదుల్ షేన్ డిఓపి గా వర్క్ చేశారు. ఒక అమ్మాయి డిఓపిగా వర్క్ చేయడం తెలుగు సినిమాల్లో చాలా అరుదు. సినిమా చూసిన తర్వాత ఆమె విజువల్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. ఒక బాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది.
మీకు మసాలా కమర్షియల్ చేయాలని ఆలోచన ఉందా
-నేను చిన్నప్పుడు నుంచి మాస్ కమర్షియల్ సినిమాలు చూస్తూనే పెరిగాను.అలాంటి సినిమాలు చేయడం నాకు ఇష్టం. అలాంటి సినిమాలు తీసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. నాకు సినిమాలంటే ఇష్టం. అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమా అంటే పిచ్చి.

పరదా సినిమాకి అవార్డ్స్ ఆశిస్తున్నారా?
-ముందు పరదా సినిమాకి డబ్బులు రావాలి. డబ్బులు వస్తే చాలామంది ఫిలిం మేకర్స్ కి ఒక హోప్ వస్తుంది. పేరు వచ్చి అవార్డులు వస్తే సరిపోదు. ఇలాంటి సినిమాకి డబ్బులు వస్తేనే మరొక నిర్మాత ఇలాంటి సినిమాలు తీయాలని ముందుకు వస్తారు.
సురేష్ బాబు గారి సపోర్ట్ ఎలా ఉంది?
-సురేష్ బాబు గారి సపోర్ట్ మర్చిపోలేము. ఆయన సినిమా చూసి ఇంత బిగ్ స్కేల్ లో ఎలా తీశారని మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. మంచి కంటెంట్ నమ్మి చేసిన సినిమా ఇది.