Monday, February 16, 2026
HomeMovie News'నాట్ ఎ డాక్టర్' టైటిల్ పోస్టర్ రిలీజ్    

‘నాట్ ఎ డాక్టర్’ టైటిల్ పోస్టర్ రిలీజ్    

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి బలమైన, కంటెంట్-బేస్డ్ చిత్రాలకు నిర్మించిన రాహుల్ యాదవ్ నక్కా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు.  నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహిస్తున్నారు. ‘భానుమతి & రామకృష్ణ’, ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రాలలో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ కాంబినేషన్ మరోసారి జతకట్టడం ఆసక్తిని పెంచింది.

- Advertisement -

‘నాట్ ఎ డాక్టర్’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం, టైటిల్ పోస్టర్‌తోనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. అడవి నేలలో నుంచి బయటికి వస్తున్న భారీ, మట్టి తడిసిన చేయి పోస్టర్‌లో కనిపిస్తూ, ప్రకృతితో ఉన్న  అనుబంధాన్ని సూచిస్తోంది. చుట్టూ పెరిగిన మాస్‌ రూట్స్‌, ఆకులు, ఎత్తైన చెట్ల నేపథ్యం కలిపి మిస్టరీతో నిండిన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. “Based on a novel that was never written” అనే ట్యాగ్‌లైన్ కథలో అద్భుతమైన భావోద్వేగాలు ఉంటాయని సూచిస్తోంది.

పాత్‌బ్రేకింగ్ సినిమాలను ప్రోత్సహించే స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, శ్రీకాంత్ నాగోతి తన ప్రత్యేకమైన కథన శైలితో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు.  సహజమైన నటనతో గుర్తింపు పొందిన నవీన్ చంద్ర ఈ చిత్రంలో ఒక విభిన్నమైన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్‌ త్వరలోనే వెలువడనున్నాయి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read