Tuesday, August 12, 2025
HomeMovie Newsచిరంజీవి లాంచ్ చేసిన కానిస్టేబుల్ కనకం ట్రైలర్

చిరంజీవి లాంచ్ చేసిన కానిస్టేబుల్ కనకం ట్రైలర్

వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్ లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 14 నుంచి ఈ సిరిస్ ఈటీవి విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కానిస్టేబుల్ కనకం ట్రైలర్ ని లాంచ్ చేసి యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

- Advertisement -

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈటీవీ విన్ ఫ్యామిలీలో ఒక పార్ట్ అని చెప్పుకోవడం చాలా గర్వంగా భావిస్తున్నాను. నితిన్ సాయి కృష్ణ గారు సుహాస్ గారికి థాంక్యూ సో మచ్. సాయిబాబా గారికి హేమంత్ గారికి థాంక్యూ సో మచ్. వారు చాలా అద్భుతమైన వ్యక్తులు. చాలా సపోర్ట్ చేశారు.  ట్రైలర్ ని లాంచ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదాలు. డైరెక్టర్ ప్రశాంత్ గారు ఈ సిరీస్ ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఒక అమ్మాయి గౌరవం పెంచేలా ఈ సిరీస్ ఉంటుంది. నాకు కానిస్టేబుల్ కనకం రోల్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి థాంక్యూ సో మచ్. ఈ సిరీస్ చూసిన తర్వాత నాకు ఆనందంతో మాటలు రాలేదు.  రాజీవ్ గారితో కలిసి నటించడం గొప్ప ఎక్స్పీరియన్స్. ఆయన ఎంతో ఆదరణ చూపించారు. ఆయన వెరీ నైస్ పర్సన్. శ్రీనివాస్ అవసరాల గారు వెరీ ఫన్ అండ్ నైస్ హ్యూమన్ బీయింగ్. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇక్కడకు విచ్చేసి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యూ సో మచ్. ఆగస్టు 14న కానిస్టేబుల్ కనకం సిరీస్ ని ఈటీవీ విన్ లో తప్పకుండా చూడండి. మీరందరూ ఎంజాయ్ చేస్తారు’ అన్నారు

డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ట్రైలర్ లాంచ్ చేయడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. దీనికి కారణమైనటువంటి మా సాయిబాబా గారికి థాంక్యూ సో మచ్. ఈ కథను నమ్మి నాతోపాటు ట్రావెల్ చేసిన సాయిబాబా గారికి థాంక్యూ సో మచ్. ఆయన లేకపోతే ఎక్కడ వరకు రీచ్ అయ్యే వాడిని కాదు. ఈటీవీ విన్ నుంచి సాయి కృష్ణ గారు నితిన్ గారికి థాంక్యూ సో మచ్. వారు మొదటి నుంచి కూడా గైడెన్స్ ఇస్తూ వచ్చారు. నాకంటే ఎక్కువగా నమ్మారు. ఆ నమ్మకాన్ని ఆగస్టు 14న నిలబెట్టుకుంటానని భావిస్తున్నాను. నా టెక్నికల్ టీమ్ అంతా నన్ను చాలా గొప్పగా సపోర్ట్ చేశారు.  ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సురేష్ బొబ్బిలి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. వర్ష, మేఘ అద్భుతంగా పెర్ఫాం చేశారు. ఈ క్యారెక్టర్స్ గురించి నేను చెప్పను. మీరు డైరెక్ట్ గా సిరీస్ లోనే చూడాలి. ఆగస్టు 14న తప్పకుండా ఈ సిరీస్ ని ఈటీవీ విన్ లో  చూడాలని కోరుకుంటున్నాను.

ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఆగస్టు 14న ఈ సీరియస్ ఈటీవీ విన్ లో రిలీజ్ అవుతుంది ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. ఈ ట్రైలర్ ని లాంచ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదాలు. సాయిబాబా గారికి థాంక్యూ. ఇది ఈటీవీ విన్ లో వచ్చే మొట్టమొదటి క్రైమ్ త్రిల్లర్. మళ్లీ మళ్లీ చూస్తారు అనడానికి నిర్వచనంలా ఉంటుంది. ప్రశాంత్ డైరెక్షను యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అని అద్భుతంగా ఉంటాయి. సురేష్ సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కట్టిపడేస్తుంది. తప్పకుండా ఈ సిరీస్ ని ఆగస్టు 14న ఈటీవీలో చూడండి’అన్నారు.

ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ మాట్లాడుతూ .. అందరికీ నమస్కారం. జూన్ లో అనగనగా సక్సెస్ లో కలిశాం.  జూలైలో ఎయిర్ సక్సెస్, ఆగస్టులో కానిస్టేబుల్ కనకం సక్సెస్ తో కలవబోతున్నాం. వరుసగా ప్రతి నెలకి ఒక సక్సెస్ ని ఇస్తున్న ఏకైక ఓటిటి ఈటీవీ విన్. ఇది ప్రేక్షకులు, సినిమాకి పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు, నటీనటునుల గొప్పతనం. ఈ ట్రైలర్ ని లాంచ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదాలు. ఆయన సపోర్ట్ ని మర్చిపోలేము. ఆగస్టు 14న పూనకాల రాబోతున్నాయి. ఈ సిరీస్ 18 నెలల కల. అహర్నిశలు ఈ సిరీస్ కోసం వర్క్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కి పని చేసిన అందరికీ థాంక్ యూ. అమ్మోరు అరుంధతి సినిమాల్ని చూసినప్పుడు ప్రేక్షకులకు ఎలాంటి అద్భుతమైన ఫీలింగ్ కలిగిందో కానిస్టేబుల్ కనకం కూడా అలాంటి గొప్ప ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది’అన్నారు.

రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాలో  మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ కి థాంక్యూ,. వర్షా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. ఈ సినిమాతో బిగ్ స్టార్ అవుతుంది. మిగతా నటినట్లు అందరూ కూడా చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. షూటింగ్ అంతా చాలా సరదాగా గడిచింది. డైరెక్టర్ ప్రశాంత్ గారు ఎఫెక్టివ్ గా పెర్ఫార్మన్స్ ని రాబట్టుకున్నారు. ఆయనకి అద్భుతమైన కెరీర్ ఉంటుంది. నేను ఫస్ట్ టైం ఈటీవీ విన్ లో ఎంత మంచి ప్రాజెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈటీవీ నితిన్ సాయి గారికి థాంక్యూ. శ్రీనివాస్ అవసరాల అద్భుతంగా తన క్యారెక్టర్ ని పండించారు. ఆగస్టు 14న తప్పకుండా ఈ సినిమాని అందరూ ఈటీవీ విన్ లో చూడాలని కోరుకుంటున్నాను.

అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇటీవలే అనగనగాతో ఈటీవీ విన్ లో ఒక అద్భుతమైన విజయాన్ని అందుకోవడం జరిగింది. మళ్ళీ ఈ సీరీస్ తో రావడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ ప్రశాంత్ కి థాంక్యూ. తను అనుకున్న ఒక పెక్యులర్ క్యారెక్టర్ లో నన్ను సెలెక్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వర్షా గారు కానిస్టేబుల్ కనకంతో మనందరినీ సర్ప్రైజ్ చేస్తారు. తప్పకుండా ఈ సినిమాని ఆగస్టు 14లో ఈటీవీ విన్లో చూడాలని కోరుకుంటున్నాను.

సుచిత్ర మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. అది మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. తప్పకుండా ఆగస్టు 14న ఈటీవీ విన్ లో కానిస్టేబుల్ కనకం చూడాలని కోరుకుంటున్నాను.

మేఘలేఖ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. ఇలాంటి ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో మరెన్నో రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తర్వాత వర్షాని  అందరూ కానిస్టేబుల్ కనకం గా గుర్తుపెట్టుకుంటారు. ఆగస్టు 14న తప్పకుండా ఈ సిరీస్ ని ఈటీవీ విన్ లో చూడాలి’అన్నారు.

ప్రొడ్యూసర్ కోవెలమూడి సత్యసాయిబాబా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కానిస్టేబుల్ కనకం ఈటీవీ విన్ లో ఆగస్టు 14న తప్పకుండా అందరూ చూడాలని కోరుకుంటున్నాను’అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో మూవీ యూనిట్ అంతా పాల్గొన్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read