యంగ్, ప్రామిసింగ్ యాక్టర్ శివ కందుకూరి హీరోగా ‘చాయ్ వాలా’ అనే చిత్రాన్ని హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక బుధవారం (ఆగస్ట్ 20) నాడు ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.
‘నా చాయ్ విలువ రూ. 15.. అంతకన్న ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా.. నా విలువ పడిపోతుంది’ అంటూ రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్‌తో టీజర్ అద్భుతంగా ఆరంభమైంది. ‘ప్రతీ పేజీలో కల్కి స్టోరీ రాస్తే పాసైపోతామని తెలిస్తే.. ఎప్పుడో పాస్ అయ్యే వాళ్లం కదరా’ అంటూ శివ కందుకూరి చెప్పిన డైలాగ్.. ఆ తరువాత తండ్రీ కొడుకుల మధ్య సీన్లు, లవ్ స్టోరీకి సంబంధించిన ట్రాక్ ఇలా అన్నింటిని చూస్తే ‘చాయ్ వాలా’ యూత్, ఫ్యామిలీకి సంబంధించిన అన్ని అంశాలను జోడించినట్టుగా అనిపిస్తుంది. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో..
*ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ* .. ‘‘చాయ్ వాలా’ టైటిల్‌ను నిర్మాత వెంకట్ గారే నిర్ణయించారు. అందరికీ కనెక్ట్ అయ్యే టైటిల్ ఇది. కథను నమ్మి ఈ ప్రాజెక్ట్‌ను చేశారు. థియేటర్లోనే వదిలేయకుండా ఇంటికి తీసుకెళ్లేలా ఉండే చిత్రాలు హిట్ అవుతాయి. ‘చాయ్ వాలా’ చిత్రాన్ని చూసిన తరువాత ఎమోషన్‌తో బయటకు వెళ్తారు. రాజీవ్ కనకాల గారు గొప్ప యాక్టర్. రెండేళ్ల క్రితం కథ చెప్పినప్పుడే రాజీవ్ కనకాల గారు తండ్రి పాత్రను పోషించిస్తారని డైరెక్టర్ ప్రమోద్ చెప్పారు. ఇమ్రాన్ రైటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. తేజు అశ్వినికి తెలుగులో చక్కటి భవిష్యత్తు ఉంటుంది. ప్రమోద్ రాసిన మంచి కథకు, మంచి నటీనటులు కలిసి వచ్చారు. శివకు సురేష్ బనిసెట్టి మంచి పాటల్ని రాస్తుంటారు. శివ స్నేహితుడిగా ఇందులో కసిరెడ్డి చాలా చక్కగా నటించారు. క్రాంతి గారు చక్కటి విజువల్స్ ఇచ్చారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. ప్రమోద్ హర్ష అనే వ్యక్తి మంచి దర్శకుడిగా నిలబడతారు.. శివకు మంచి పేరు వస్తుంది.. నిర్మాత వెంకట్ గారు ఇలాంటి మంచి చిత్రాలెన్నో నిర్మించాలి. ‘చాయ్ వాలా’ చిత్రం ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
*శివ కందుకూరి మాట్లాడుతూ* .. ‘‘చాయ్ వాలా’ టీంతో నాకు మంచి బంధం ఏర్పడింది. ప్రమోద్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. మా నిర్మాత ఈ కథను మాకంటే ఎక్కువగా నమ్మారు. ఈ ప్రయాణంలో ప్రమోద్ నాకు మంచి స్నేహితుడిగా మారిపోయారు. రైటర్ ఇమ్రాన్, డీఓపీ క్రాంతి, ఆర్ట్ సుప్రియ ఇలా మంచి టీంతో ప్రమోద్ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని చూసి వచ్చిన తరువాత తండ్రితో కాసేపు మాట్లాడతారు. థియేటర్ నుంచి ఓ మంచి ఎమోషన్‌తోనే బయటకు వస్తారని మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఎంతో ఎంజాయ్ చేస్తూ సినిమా షూటింగ్ చేశాం. నిర్మాత వెంకట్ గారికి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. ప్రతీ రోజూ సినిమా గురించి, సీన్ల గురించి చర్చించేవారు. ఆయనతో మళ్లీ మళ్లీ పని చేయాలని ఉంది. రాజీవ్ కనకాల గారితో పని చేసిన క్షణాల్ని నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. ఆయన్నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. తేజుతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఆమె చాలా మల్టీ టాలెంటెడ్. మా టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మా ‘చాయ్ వాలా’ చిత్రం త్వరలోనే థియేటర్లోకి రానుంది. అందరినీ ఆకట్టుకునేలా మా మూవీ ఉంటుంది’ అని అన్నారు.
*దర్శకుడు ప్రమోద్ హర్ష మాట్లాడుతూ* .. ‘‘శివ గారికే ఈ కథను చెప్పాను. కథకు తగ్గట్టుగా ఫేస్‌లోనే ఓ సెన్సిబిలిటీ, ఓ జాలీ కనిపించాలి. అందుకే శివ గారికి ‘చాయ్ వాలా’ కథను చెప్పాను. నేను రాసుకున్న పాత్రలు, కథ నుంచే ‘చాయ్ వాలా’ టైటిల్‌ను తీసుకున్నాను. ప్రతీ మనిషి జీవితంలో జరిగే సంఘటనలే మా చిత్రంలో ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా మా సినిమా ఉంటుంది’ అని అన్నారు.
*నిర్మాత వెంకట్ ఆర్. పాపుడిప్పు మాట్లాడుతూ* .. ‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూసి చూడు అని అంటారు కానీ.. సినిమా చేస్తేనే అసలు విషయం తెలుస్తుంది. ఈ మూవీలోని కొన్ని సీన్లను ఆల్రెడీ చూశాను. నా కంట్లోంచి నీళ్లు వచ్చాయి. ఇదొక సెన్సిబుల్ లవ్ స్టోరీ. అందరినీ ఆకట్టుకునేలా ఈ మూవీని తీశార’ని అన్నారు.
*తేజు అశ్విని మాట్లాడుతూ* .. ‘తెలుగులో నాకు ‘చాయ్ వాలా’ మొదటి చిత్రం. రాజీవ్ కనకాల వంటి సీనియర్ ఆర్టిస్ట్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. శివ గారు అద్భుతమైన కో ఆర్టిస్ట్. క్రాంతి గారు మా అందరినీ అందంగా చూపించారు. సెట్‌లో మా అందరినీ రాజ్ కందుకూరి గారు ఎంకరేజ్ చేస్తుండేవారు. ‘చాయ్ వాలా’ అందరికీ నచ్చుతుంది’ అని న్నారు.

*రాజీవ్ కనకాల మాట్లాడుతూ* .. ‘నిర్మాత వెంకట్ రెడ్డి గారు ‘చాయ్ వాలా’ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ మూవీతో ఆయనకు పెద్ద విజయం రాబోతోంది. హర్షిక బ్యానర్ ఇండస్ట్రీలో సెటిల్ అవుతుంది. ప్రమోద్ హర్ష నాకు ‘ఉంగరాల రాంబాబు’ టైంలో పరిచయం. ప్రమోద్ చెప్పిన కథ విని ఆశ్చర్యపోయాను. ‘చాయ్ వాలా’ కథ నాకు చాలా నచ్చింది. ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటూనే ఎమోషన్స్ ఉంటాయి. ప్రమోద్ ఏడాదికి కనీసం రెండు చిత్రాలైనా చేయాలి. ప్రతీ సీన్‌ను ఎంతో వివరించి నటీనటుల నుంచి నటనను రాబట్టుకునేవాడు. రాజ్ కందుకూరి గారు ఈ సినిమా మీద మా అందరి కంటే ఎక్కువ నమ్మకంగా ఉండేవారు. కొడుకు కోసం ఆయన ఎంతో చేస్తుంటారు. ‘చాయ్ వాలా’ని ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. కసిరెడ్డి అద్భుతమైన నటుడు. మా డీఓపీ క్రాంతి ఎంతో వేగంగా పని చేసేవారు. రచయిత ఇమ్రాన్ గారు కూడా సెట్స్‌కి వచ్చి సపోర్ట్ చేస్తుండేవారు. సుప్రియ గారి ఆర్ట్ వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది. తేజు అశ్వినితో నాకు కొన్ని సీన్లే ఉంటాయి. తేజు చాలా చక్కగా నటించారు. శివ కందుకూరి బోలెడంత ఆకలితో ఉన్న ఆర్టిస్ట్. నా పక్కన ఎక్కడా తగ్గకుండా ఉండాలని ఎంతో తపన పడి నటించేవాడు. ఆ ఆకలితో ఉన్న శివ కందుకూరి ఎంతో ఎత్తుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ‘చాయ్ వాలా’ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
*నటుడు రాజ్ కుమార్ కసిరెడ్డి మాట్లాడుతూ* .. ‘ప్రమోద్ నాకు నాలుగేళ్లుగా తెలుసు. ఈ కథ ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. అందరినీ ఆకట్టుకునేలా ఈ మూవీని తెరకెక్కించారు. రాజీవ్ కనకాల గారు పండించిన ఎమోషన్, ఆయన పాత్ర ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. శివతో నటించడం చాలా ఆనందంగా ఉంది. శివతో మళ్లీ మళ్లీ నటించాలని ఉంది. తేజు అశ్వినీ గారు అద్భుతంగా నటించారు. డీఓపీ క్రాంతి మా అందరినీ చాలా బాగా చూపించారు. రాజ్ కందుకూరి గారే మాలాంటి కొత్త వాళ్లందరినీ మొదటగా అభినందించారు. కొత్త వారిని ఎంకరేజ్ చేసేందుకు ఆయన ఎప్పుడూ ముందుంటారు. ‘చాయ్ వాలా’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.