Wednesday, December 25, 2024
HomeMovie Newsకొండగట్టు అంజన్నను దర్శించుకున్న 'క' టీమ్

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ‘క’ టీమ్

- Advertisement -

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ అంచనాలకు మించి పెద్ద సక్సెస్ సాధించింది. పీరియాడిక్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి సుజీత్-సందీప్ దర్శకత్వం వహించారు. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన తొలి రోజే రూ.6 కోట్ల వసూళ్లు సాధించి వార్తల్లో నిలిచింది. వీకెండ్‌లో కూడా మంచి వసూళ్లు రాబడుతూ ముందుకు సాగుతోంది.

ఇప్పటివరకు వచ్చిన వసూళ్లతో ఈ చిత్రం సోమవారానికి బ్రేక్ ఈవెన్ అందుకుంటుందని, ఆ తర్వాత వచ్చే వసూళ్లన్నీ లాభాలుగా మారతాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్,’ శివకార్తికేయన్ ‘అమరన్’ చిత్రాలతో పోటీ ఎదురైనా, ‘క’ విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషంగా మారింది. ఈ విజయోత్సాహంలో భాగంగా ‘క’ చిత్ర బృందం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read