సుడిగాలి పాటలు విడుదల

వెంకటేష్ గౌడ్, ప్రాచీ అధికారి, అభయ్, కులకర్ణి మమత హీరో హీరోయిన్లు గా రమేష్ అంకం దర్శకత్వంలో చెట్టుపల్లి లక్ష్మీ సమర్పణలో శివ పార్వతి క్రియేషన్స్ పతాకంపై చెట్టుపల్లి వెంకటేష్ ,బిరాదర్ మల్లేష్ నిర్మిస్తున్న యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం సుడిగాలి. ఈ చిత్రంలోని పాటలు మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విడుదల అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎం ఎల్ సి రాములు నాయక్ బిగ్ సీడీని విడుదల చేయగా, నిర్మాత సాయి వెంకట్ సీడీని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో పలువురు అతిదులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Sudigaali Movie Audio Launch
Sudigaali Movie Audio Launch
ఈ చిత్రములో సుమన్,గౌతమ్ రాజ్,సుమన్ శెట్టి, చిట్టిబాబు,నరసింహ,సుహాశిని,వర్మ,కృష్ణ,తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
 పాటలు: శ్రీను సాగర్.ఎం.భాష శ్రీ,దాట్లవెంకన్న
కెమెరా: విద్య సాగర్
ఎడిటింగ్: వినయ్ రామ్
మ్యూజిక్:రాప్ రాక్ షకీల్
ఫైట్స్:రియల్ సతీష్
నిర్మాతలు : చెట్టుపల్లి వెంకటేష్ , బిరాదర్ మల్లేష్ 
సమర్పణ:చెట్టుపల్లి లక్మి
కథ ,మాటలు దర్శకత్వం : రమేష్ అంకం
నిర్మాతలు మాట్లాడుతూ …ఈ చిత్రంలో ఐదు పాటలు,ఐదు ఫైట్లు ఉన్నాయి రాప్ రాక్ షకీల్ మంచి మ్యూజిక్ తో పాటు రేరికార్డింగ్ అద్భుతంగా అందించారు. ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ ఫైట్స్ అద్భుతంగా కంపోజ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో అద్భుత మైన లొకేషన్స్ లో షూటింగ్ పూర్తిచేసాం .ఈ చిత్రం లో సుమన్ గారు అద్భుత మైన లీడ్ రోల్ పోషించారు.ప్రస్తుతము పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న మా చిత్రం త్వరలోనే పూర్తి చేసుకుని  సినిమా ను విడుదల చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము .ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాము అన్నారు.