కేరళ బాధితుల సహయార్థం విరాళం ప్రకటించిన ప్రముఖ నిర్మాత

కేరళ బాధితుల సహయార్థం లక్ష రూపాయల విరాళం ప్రకటించిన ప్రముఖ నిర్మాత ప్రతాప్ కొలగట్ల
తుఫాన్ బీభత్సంతో అతలాకుతలం అయిన కేరళ ప్రజలను ఆదుకునేందుకు నిర్మాత ప్రతాప్ కొలగట్ల ముందుకొచ్చారు. వరదల్లో కొందరు చనిపోయిన సంగతి తెలిసిందే. కేరళ లో ప్రస్తుతం ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేరళ ప్రజలకు తన వంతు సహాయార్థం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు లక్ష రూపాయలు అందించబోతున్నట్లు ప్రకటించారు 3G లవ్ చిత్ర నిర్మాత ప్రతాప్ కొలగట్ల .
తనలాగే మరికొంత మంది నిర్మాతలు ముందుకొచ్చి కేరళకు తమ వంతుగా సహాయం అందించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.