రాజ్‌ కందుకూరి విడుదల చేసిన ‘కాలేజ్‌ పోరగాళ్ళు’ ఆడియో

మంత్ర ఆర్ట్స్‌ పతాకంపై అన్నం చంద్రశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాలేజ్‌ పోరగాళ్ళు’. ‘సదువు తక్కువ సోకులెక్కువ’ ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో మల్లిఖార్జున్‌, కవిత హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కెమెరామెన్‌ శ్రీధర్‌ నేతృత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి రాంబాబు మ్యూజిక్‌ అందించాడు. ఈ చిత్రంలోని పాటలను ఇటీవల ప్రముఖ నిర్మాత రాజ్‌ కందకూరి టీవి9లో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేసారు.

ఈ సందర్భంగా రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ… ఈ చిత్రంలోని పాటలన్నీ నేను విన్నాను. అద్భుతంగా వున్నాయి. ఈ చిత్రం ట్రైలర్‌ కూడా చాలా బాగుంది. పాటలు బాగున్నట్లుగానే ఈ చిత్రం కూడా అద్భుతంగా వుండి మంచి హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను. నేటి యువతకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని దర్శకుడు అన్నం చంద్రశేఖర్‌ అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రం యూనిట్‌ మొత్తానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

చిత్ర దర్శకుడు అన్నం చంద్రశేఖర్‌ మాట్లాడుతూ… ఈ చిత్రంలోని పాటలని ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేయడం ఆనందంగా వుంది. పాటలన్నీ అద్భుతంగా వున్నాయని అందరూ చెపుతున్నారు. మా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఖర్చుకు వెనకాడకుండా మా వెన్నంటే వుండి మా యూనిట్‌కి కావల్సినవి వెంటనే సమకూర్చారు. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. నేటి యువతకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నాన్ని ఈ ‘కాలేజ్‌ పోరగాళ్ళు’ చిత్రం ద్వారా చేసాము. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. అతి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అని అన్నారు.

నటీనటులు :
మల్లిఖార్జున్‌, కవిత మెహతో, టింకు, పవన్‌, సునీల్‌, శ్రీను చౌహాన్‌, స్వప్న, ప్రియ, శిరీష, చరణ్‌నాయుడు, మల్లేష్‌ తదితరులు…

టెక్నీషియన్స్‌ :
బ్యానర్‌: మంత్ర ఆర్ట్స్‌, కెమెరా: రమేష్‌, ఎడిటింగ్‌: రాజు, రీ-రికార్డింగ్‌: ఎల్‌ఎం ప్రేమ్‌, సంగీతం: ఎల్‌ఎం ప్రేమ్‌, నిర్మాత: మంత్ర ఆర్ట్స్‌, కథ-స్క్రేన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: అన్నం చంద్రశేఖర్‌.