భరత్ అనే నేను 100 డేస్ ఉత్సవాలు

రాజమండ్రి అశోక దియేటర్ లో నగర సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అభిమానుల ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను వంద రోజుల వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు , మహేష్ బాబు బాబాయ్ , పద్మాలయా అధినేత, ప్రముఖ నిర్మాత శ్రీ  ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ( బంగారయ్య ) కేక్ కట్ చేసారు . ఈ సందర్భంగా తు.గో జిల్లా చిత్ర పంపిణిదారుడు భరత్ చౌదరి మరియు అశోక థియేటర్ యజమాని రాజబాబు లకు వంద రోజుల షీల్డ్ అందజేశారు. ముఖ్యఅతిథి బంగారయ్య గారిని అభిమానులు గజమాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలనటుడిగా ఎంతో ప్రతిభ చూపించిన మహేష్ బాబు రాజకుమారుడిగా హీరోగా పరిచయమై మురారి ఒక్కడు పోకిరి దూకుడు లతో సూపర్ స్టార్ స్టార్ డమ్ సంపాదించుకొని అభిమాన , ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకున్న శ్రీమంతుడిగా , భరత్ అనే నేను ఒక రాజకీయ సంచలన చిత్రంగా ఘన విజయంసాధించడం చాలా సంతోషంగా ఉందని , వైవిధ్యమైన దర్శకులు నిర్మాతలను ఎన్నుకొంటూ మహేష్ బాబు అభిమానులను ఎప్పటికి వారి కోరిక మేరకు సంతృప్తి పరుస్తాడని పేర్కొన్నారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని థియేటర్ కళామందిర్ లో పట్టణ కృష్ణ మహేష్ యువత, హెల్పింగ్ పుపిల్స్ సొసైటీ E శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో  సూపర్ స్టార్ “మహేష్ బాబు” నటించిన “భరత్ అనే నేను ” చిత్రం 100 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు . ముఖ్య అతిధులుగా  చంటి (విజయవాడ), దర్శి సురేష్ (నెల్లూరు), సుబ్బా రాజు (భీమవరం) గార్లు విచ్చేసారు. థియేటర్ లీజ్ ప్రొప్రయిటర్ రవి కుమార్ గారికి 100 రోజుల షీల్డ్ బహుకరించారు.