చిరు సినిమాల స్ఫూర్తితో రజిని మూవీ ?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా షూటింగ్ యమా స్పీడ్ గా జరుగుతోంది. డెహ్రాడూన్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన తాజా అప్ డేట్ కోలీవుడ్ లో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. దాని ప్రకారం ఇది 1996లో చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ తరహాలో ఉంటుందట.

రజని కాలేజీ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తూనే రాత్రి పూట తన జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళను వెతికే పనిలో ఉండటం చిరు చేసిన   చూడాలని ఉంది తరహాలో ఉందని వినికిడి.  తన కొడుకులు చదివే కాలేజీలోనే ఉంటూ తాను తండ్రని చెప్పకుండా రజని చేసే డ్రామా కార్తీక్ సుబ్బరాజ్ కొత్తగా రాసుకున్నాడట. సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే వచ్చి విలన్ గా చేస్తున్న విజయ్ సేతుపతి చేతిలో చనిపోయేలా ఉంటుందట. మొత్తానికి కొత్తదనం లేకుండా కమర్షియల్ గానే వెళ్తున్నాడు సుబ్బరాజ్.

ఈ మధ్య ఇంట్రో సాంగ్స్ విషయంలో పూర్తిగా నిరాశ పరుస్తున్న రజని బాషా, నరసింహ రేంజ్ సాంగ్  అనిరుద్ ని కంపోజ్ చేయమని చెప్పారట. దాంతో పాటు అద్భుతమైన ఇంట్రడక్షన్ ఫైట్ ని ప్లాన్ చేసినట్టు తెలిసింది.కబాలి, కాలా విషయంలో జరిగిన పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. మొత్తానికి  కొత్తదనం లేకుండా ఫాన్స్ ని మెప్పించడం కోసం రొటీన్ గానే వెళ్తున్నట్టు కనిపిస్తోంది.